News September 21, 2025
ఎల్లో అలర్ట్.. భారీ వర్షాలు

TGలో ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, ఉమ్మడి ఆదిలాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో ద్రోణి ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది.
Similar News
News September 21, 2025
తెలంగాణ న్యూస్ అప్‌డేట్స్

* వరంగల్ వేయి స్తంభాల గుడిలో నేడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బతుకమ్మ వేడుకలు.. హాజరుకానున్న మంత్రులు సీతక్క, కొండా సురేఖ, జూపల్లి
* ఈ నెలలో రాష్ట్రానికి అదనంగా 1.17 లక్షల టన్నుల యూరియా: మంత్రి తుమ్మల
* ప్రతి 20kmలకు ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించండి: మంత్రి దామోదర రాజనర్సింహ
* సొంతూరు చింతమడకలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్న జాగృతి చీఫ్ కవిత
News September 21, 2025
మైథాలజీ క్విజ్ – 12

1. లక్ష్మణుడి భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?
2. మహాభారతంలో సత్యవతి, శంతనుల కుమారులు ఎవరు?
3. వేదాల ప్రకారం.. మొదట మరణించిన వ్యక్తి ఎవరు?
4. మానస సరోవరం ఏ దేశంలో ఉంది?
5. సమ్మక్క సారలమ్మ జాతర ఏ జిల్లాలో జరుగుతుంది?
– సమాధానాలు సాయంత్రం 6 గంటలకు.
<<-se>>#mythologyquiz<<>>
News September 21, 2025
స్థానిక ఎన్నికలు.. ఏం చేద్దాం?

స్థానిక ఎన్నికలపై నిన్న మంత్రులతో సమావేశమైన సీఎం రేవంత్ 2, 3 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు తెలుస్తోంది. బీసీల రిజర్వేషన్ బిల్లులు గవర్నర్, రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండటంతో స్పెషల్ జీవో జారీ చేసి ఎన్నికలకు వెళ్దామని కొందరు మంత్రులు చెప్పినట్లు సమాచారం. చట్టం వచ్చాకే ఎన్నికలు నిర్వహిద్దామని మరికొందరు అన్నారట. పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేద్దామని పలువురు సూచించినట్లు సమాచారం.