News June 20, 2024
YELLOW ALERT: రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
TG: ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ నెల 25 వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వానలు పడతాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Similar News
News January 19, 2025
బుల్లిరాజు పాత్రకు మహేశ్‌బాబు ఫిదా!
ప.గో జిల్లా భీమవరానికి చెందిన బుల్లిరాజు క్యారెక్టర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఈ పాత్రకు ముగ్ధులైనట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘బుల్లిరాజు’ పాత్రలో నటించిన రేవంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘సినిమా చూశాక మహేశ్ సార్‌ను టీమ్‌తో కలిశాను. చాలా బాగా చేశావు బుల్లిరాజు. నీ కోసమైనా మళ్లీ సినిమా చూస్తానన్నారు. నాతో పాటు డాన్స్ కూడా చేశారు’ అని చెప్పుకొచ్చారు.
News January 19, 2025
డిప్యూటీ CM పదవికి లోకేశ్ అన్ని విధాలా అర్హుడు: సోమిరెడ్డి
AP: మంత్రి లోకేశ్‌ను డిప్యూటీ CM చేయాలన్న పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ప్రతిపాదనను MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమర్థించారు. ‘ఆ పదవికి లోకేశ్ వందశాతం అర్హులే. రాజకీయంగా అనేక డక్కామొక్కిలు తిని, అవమానాలు ఎదుర్కొన్నాక పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారు. డిప్యూటీ CM పదవికి అన్ని విధాలా అర్హుడైన ఆయన పేరును పరిశీలించాలని పార్టీని కోరుతున్నాను’ అని ట్వీట్ చేశారు.
News January 19, 2025
రేషన్ కార్డు నిబంధనల్లో మార్పులు చేయాలి: హరీశ్ రావు
TG: ప్రజాపాలన దరఖాస్తులకూ రేషన్ కార్డులు ఇస్తామనే ప్రభుత్వ ప్రకటన BRS విజయమని హరీశ్ రావు అన్నారు. ప్రతిపక్షం నిలదీస్తే గానీ, ప్రభుత్వం పేదల గురించి ఆలోచించదా? అని ప్రశ్నించారు. మీ సేవా దరఖాస్తులు కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఆదాయ పరిమితి, భూ పరిమితి పెంచుతూ నిబంధనల్లో మార్పు చేయాలని కోరారు. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ను ఉపాధి హామీ స్కీమ్‌కు లింక్ చేయొద్దన్నారు.