News October 25, 2025
ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రాష్ట్రంలో 3రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, WGL, HNK, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, HYD, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఉమ్మడి MBNR జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Similar News
News October 25, 2025
బస్సు ప్రమాదం.. వందల ఫోన్లు పేలడంతో?

AP: కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది అగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా తెలుస్తోండగా మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. డోర్ దగ్గర ఉన్న చిన్న హైడ్రాలిక్ సిలిండర్ పేలిపోగా డోర్లు తెరుచుకోలేదు. అటు లగేజీ క్యాబిన్‌లో 400కు పైగా ఫోన్లతో ఉన్న పార్సిల్ ఉన్నట్లు ఫోరెన్సిక్ టీమ్ గుర్తించింది. వేడికి ఈ బ్యాటరీలు పేలడం ప్రమాద తీవ్రతను పెంచిందని చెబుతున్నాయి.
News October 25, 2025
మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు!

AP: టెన్త్ పరీక్షలు వచ్చే ఏడాది MAR 16 నుంచి నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. NOV 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు ఫీజు చెల్లింపులకు అవకాశం కల్పించనున్నారు. ఈ ఏడాది కొత్తగా హాల్ టికెట్ల వెనక QR కోడ్ ఇవ్వనున్నారు. దాన్ని స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం రూట్ మ్యాప్ రానుంది. అటు చదువులో వెనకబడిన విద్యార్థుల కోసం 100డేస్ ప్రణాళికను DEC నుంచి అమలు చేయనున్నారు.
News October 25, 2025
డ్రగ్స్ కేసు.. సినీ నటులకు ఈడీ సమన్లు

డ్రగ్స్ కొనుగోలు కేసులో సినీ నటులు <<16798985>>శ్రీరామ్<<>>(శ్రీకాంత్), కృష్ణకు ఈడీ సమన్లు జారీ చేసింది. జూన్‌లో ప్రదీప్ కుమార్ అనే వ్యక్తికి మత్తు పదార్థాలు సప్లై చేసినందుకు జాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో వీరి హస్తం ఉందని విచారణలో తేలడంతో అరెస్టు చేయగా జుడీషియల్ రిమాండ్ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసు EDకి చేరడంతో ఈ నెల 28న శ్రీకాంత్, 29న నటుడు కృష్ణ దర్యాప్తునకు రావాలని కోరింది.


