News August 13, 2024

YELLOW ALERT: ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలో మరో 2 రోజులు వర్షాలు కొనసాగుతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ, జనగాం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో నేడు మోస్తరు వానలు కురుస్తాయని APSDMA తెలిపింది.

Similar News

News January 26, 2026

BJPకి రాజీనామా.. మళ్లీ BRSలోకి మాజీ MLA

image

TG: వర్ధన్నపేట మాజీ MLA ఆరూరి రమేశ్ BJP సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎల్లుండి తిరిగి BRSలో చేరనున్నట్లు ప్రకటించారు. తన అనుచరులతో సమావేశమై బీజేపీని వీడాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వర్ధన్నపేట నుంచి రమేశ్ 2014, 2018లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2023 ఎన్నికల్లో BRS తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆయన 2024 మార్చిలో BJPలో చేరారు. తాజాగా BRS ఆహ్వానం మేరకు ఆ పార్టీలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు.

News January 26, 2026

నలుగురు మంత్రుల అత్యవసర భేటీ?

image

TG: ఓవైపు సీఎం రేవంత్ అమెరికాలో ఉండటం, మరోవైపు సింగరేణిపై రచ్చ కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసం ప్రజాభవన్‌లో నలుగురు మంత్రులు అత్యవసరంగా సమావేశమైనట్లు సమాచారం. లోక్‌భవన్‌లో ఎట్ హోం ముగిశాక భట్టి, శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌, అడ్లూరి ఒకే కారులో ప్రజాభవన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ అంశం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

News January 26, 2026

రేపు అఖిలపక్ష భేటీ

image

ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష భేటీ నిర్వహిస్తోంది. పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆహ్వానం పంపారు. పార్లమెంట్ సమావేశాల్లో సహకరించాలని కేంద్రం కోరనుంది. అలాగే ప్రవేశపెట్టే బిల్లుల వివరాలను విపక్షాలకు ఇవ్వనుంది. కాగా ఈ నెల 28 నుంచి FEB 13 వరకు, MAR 9 నుంచి APR 2 వరకు రెండు విడతల్లో సమావేశాలు జరగనున్నాయి.