News March 30, 2024
ఎల్లో అలర్ట్: అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
తెలంగాణలో ఎండ బెంబేలెత్తిస్తోంది. నిత్యం సాధారణం కంటే 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. బయటికి వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
Similar News
News February 5, 2025
UCC: మొదటి ‘సహ జీవనం’ జోడీ నమోదు
ఉత్తరాఖండ్లో UCC అమల్లోకి వచ్చిన 9 రోజుల తర్వాత సహజీవనం చేస్తున్న మొదటి జోడీ తమ బంధాన్ని రిజిస్టర్ చేసుకుంది. మరో రెండు జంటల అప్లికేషన్లు పరిశీలనలో ఉన్నాయని తెలిసింది. నిబంధనల ప్రకారం UCC అమల్లోకి వచ్చిన నెల రోజుల్లోనే ‘లివిన్ కపుల్స్’ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. గడువు దాటితే 6 నెలల వరకు జైలుశిక్ష, రూ.25వేల ఫైన్ లేదా ఆ రెండూ విధించొచ్చు. ఇక మంగళవారం నాటికి 359 పెళ్లిళ్లు నమోదయ్యాయి.
News February 5, 2025
ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 58 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. సా.6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి.
News February 5, 2025
తండ్రి అయ్యేందుకు 11వేల కి.మీలు ప్రయాణం
దక్షిణ చిలీలోని ‘పార్క్ టంటాకో’ అటవీ ప్రాంతాల్లో ఉండే డార్విన్స్ కప్పలకు ప్రాణాంతక కైట్రిడ్ ఫంగస్ సోకినట్లు 2023లో గుర్తించారు. దీంతో ఈ జాతి అంతరించిపోకుండా ఉండేందుకు చేపట్టిన ఎమర్జెన్సీ మిషన్లో మగ కప్పలను యూకేకు తరలించారు. దీనికోసం బోటు, విమానం, కారులో ఇలా 11వేల కి.మీలకు పైగా ప్రయాణించాయి. ఎట్టకేలకు ఈ అసాధారణ విధానం ద్వారా యూకేలో 33 పిల్లలు జన్మనిచ్చాయి. ఇవి 2గ్రాముల కంటే తక్కువ బరువుంటాయి.