News January 14, 2025
నేడు పసుపు బోర్డు ప్రారంభం
TG: కేంద్రం ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి పర్వదినాన పసుపు బోర్డును ఇవాళ కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఇప్పటికే జాతీయ బోర్డు ఛైర్మన్గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 15 ఏళ్లుగా బోర్డు ఏర్పాటుకు రైతులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News January 14, 2025
నా మనసులో గేమ్ ఛేంజర్కు ప్రత్యేక స్థానం: చెర్రీ
గేమ్ ఛేంజర్ మూవీకి తన మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని గ్లోబల్ స్టార్ రామ్చరణ్ అన్నారు. తనతో పాటు ఈ మూవీ కోసం కష్టపడ్డ ప్రతిఒక్కరికి అభినందనలు తెలిపారు. ఇకపైనా తన పర్ఫార్మెన్స్తో అభిమానులను గర్వపడేలా చేస్తానని ఇన్స్టాలో రాసుకొచ్చారు. చివరిగా తనకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శంకర్కు చెర్రీ ధన్యవాదాలు తెలిపారు.
News January 14, 2025
పసుపు బోర్డుతో రైతుల కల నెరవేరింది: బండి
TG: నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుతో పండగ రోజు రైతుల కల నెరవేరిందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. దీని ద్వారా వారి జీవితాల్లో కొత్త వెలుగులు రానున్నట్లు చెప్పారు. ఎంపీ అర్వింద్ పట్టుదలతో తన హామీ నెరవేర్చుకున్నారని చెప్పారు. రైతుల కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి రైతులు తమ ఆశీర్వాదం అందించాలని బండి కోరారు.
News January 14, 2025
నలుగురు పిల్లలుంటే 400 ఎకరాలు ఉన్నట్టు: CBN
AP: మనదేశానికి జనాభే అతిపెద్ద ఆదాయ వనరు అని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఒకప్పుడు నేను పాపులేషన్ కంట్రోల్ అని చెప్పా. కానీ ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ అని చెబుతున్నా. పిల్లలే మీ ఆస్తి. నలుగురు పిల్లలుంటే 400 ఎకరాలు ఉన్నట్టు. జపాన్, సౌత్ కొరియా తదితర దేశాల్లో యువత లేక మనవాళ్లను అడుగుతున్నారు. ఇటీవల MP ప్రభుత్వం కూడా నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష బహుమతి ఇస్తామని ప్రకటించింది’ అని CBN తెలిపారు.