News September 7, 2024

పసుపు వినాయకుడి ప్రతిమ ఎందుకంటే..

image

ఏ పనిలోనైనా ముందు పూజ వినాయకుడికేనన్నది సంప్రదాయం. అటు హైందవ సంప్రదాయంలో పసుపునకు ఉన్న విశిష్టత అంతాఇంతా కాదు. అందుకే గణేశ చవితిరోజున పసుపుతో చేసిన వరసిద్ధి వినాయకుడిని కొలుచుకుంటుంటాం. సహజంగా యాంటీ ఫంగల్ అయిన పసుపుతో చేసిన వినాయకుడి నిమజ్జనం తర్వాత చెరువుల్లోని రోగకారకాలు అంతమవుతాయని శాస్త్రీయ వివరణ. అమ్మవారు బుజ్జి గణపతిని తొలుత పసుపు-నలుగుతోనే తయారుచేశారనేది పురాణ ప్రాశస్త్యం.

Similar News

News November 23, 2025

అనకాపల్లి: ఈనెల 24 నుంచి రైతు వారోత్సవాలు

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈనెల 24 నుంచి 29 వరకు రైతు వారోత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు
అనకాపల్లి జిల్లా వ్యవసాయ అధికారి ఎం.ఆశాదేవి ఆదివారం తెలిపారు. దీని ద్వారా ప్రతి రైతు ఇంటికి వెళ్లి వ్యవసాయ సిబ్బంది అవగాహన కల్పిస్తారని అన్నారు. ప్రతి 3 రైతు కుటుంబాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి రోజుకి 30 క్లస్టర్ల (90 కుటుంబాలు)కు చెందిన రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు.

News November 23, 2025

స్మృతి మంధాన పెళ్లి వేదిక వద్దకు అంబులెన్స్.. పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్!

image

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ కంపోజర్ పలాశ్ ముచ్చల్ పెళ్లి వేదిక వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. వేడుకలకు హాజరైన అతిథికి గుండెపోటు రావడంతో అంబులెన్స్‌లో సాంగ్లీలోని సర్వ్‌హిత్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి వివరాలు తెలియనప్పటికీ పెళ్లి పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై ఈవెంట్ ఆర్గనైజర్లు, కుటుంబ సభ్యులు ఇంకా స్పందించలేదు.

News November 23, 2025

భారత్vsదక్షిణాఫ్రికా.. రెండో రోజు ముగిసిన ఆట

image

గువాహటిలో దక్షిణాఫ్రికా, టీమ్ ఇండియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్సులో వికెట్లేమీ కోల్పోకుండా 9 పరుగులు చేసింది. అంతకుముందు తొలి ఇన్నింగ్సులో దక్షిణాఫ్రికా 489 రన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా పంత్ సేన 480 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో జైస్వాల్(7), రాహుల్(2) ఉన్నారు. రేపు దూకుడుగా ఆడి లీడ్ దిశగా సాగితేనే మ్యాచ్‌పై పట్టు బిగించే అవకాశం ఉంది.