News February 1, 2025
అవును.. చైనా ల్యాబ్ నుంచే కొవిడ్ వచ్చింది: అమెరికా

చైనా ల్యాబ్ నుంచే కరోనా వైరస్ బయటికి వచ్చినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని అమెరికా అధ్యక్ష కార్యాలయ కార్యదర్శి కరోలిన్ లెవిట్ ప్రెస్మీట్లో తెలిపారు. ‘కొవిడ్ వైరస్ చైనా ల్యాబ్ నుంచి వచ్చిందని చాలా ఏళ్ల క్రితమే ట్రంప్ అన్నారు. అప్పట్లో అందరూ ఆయన్ను వెక్కిరించారు. కానీ ఆయన చెప్పింది వాస్తవం. దానికి సంబంధించిన సాక్ష్యాలు బైడెన్ హయాంలోనే లభించాయి. గత సర్కారు ఎందుకో వాటిని బయటపెట్టలేదు’ అని పేర్కొన్నారు.
Similar News
News January 22, 2026
ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీ బయాటిక్స్ అమ్మొద్దని వార్నింగ్

TG: మెడికల్ షాపుల ఓనర్లకు డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వార్నింగ్ ఇచ్చింది. ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీ బయాటిక్స్ విక్రయించవద్దని ఆదేశించింది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా అలాంటి 190 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విచ్చలవిడిగా యాంటీ బయాటిక్స్ వాడితే ‘యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్’ బారినపడతారని, ఇది ప్రాణాంతకం అని తెలిపింది. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ అని స్పష్టం చేసింది.
News January 22, 2026
వైద్య రంగంలో సరికొత్త విప్లవం..!

ఐఐటీ బాంబే & IIT మండి శాస్త్రవేత్తలు చిన్న రోబోల సహాయంతో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని కనిపెట్టారు. బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు నీటిలోకి వెళ్లి, ఒకేసారి దిశ మార్చుకుంటూ ఎలా ఈదుతాయో ఈ రోబోల ద్వారా విజయవంతంగా గుర్తించారు. జీవుల ప్రాథమిక కదలికలను అర్థం చేసుకోవడానికి ఈ ప్రయోగం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి నానో రోబోలు మానవ రక్తనాళాల్లోకి వెళ్లి వ్యాధి ఉన్న చోటే మందులు అందించేలా ప్రయోగాలు చేయనున్నారు.
News January 22, 2026
IITల్లో ఆగని ఆత్మహత్యలు.. మానసిక సమస్యలే కారణమా!

దేశవ్యాప్తంగా ఉన్న IITల్లో విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. IIT కాన్పూర్లో మంగళవారం మరో స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నారు. రెండేళ్ల వ్యవధిలో ఇదే క్యాంపస్లో 9మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుల, భాషా వివక్ష, ఒంటరితనం, పోటీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో సూసైడ్ చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆత్మహత్యల నివారణ, కారణాలను తెలుసుకునేందుకు సుప్రీంకోర్టు ఇప్పటికే టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసింది.


