News November 21, 2024
అవును.. మా అమ్మాయికి పెళ్లి: కీర్తి సురేశ్ తండ్రి

నటి కీర్తి సురేశ్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. చిన్ననాటి స్నేహితుడు ఆంథోనీ తట్టిల్తో వచ్చే నెలలో గోవాలో ఆమె వివాహం చేయనున్నట్లు కీర్తి తండ్రి సురేశ్ కుమార్ ఆన్మనోరమ వార్తాసంస్థకు తెలిపారు. తట్టిల్కి కేరళ, చెన్నైలో వ్యాపారాలున్నాయి. కుటుంబీకులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరుగుతుందని ఆయన వెల్లడించారు.
Similar News
News November 2, 2025
నదుల పక్కన ఇంటి నిర్మాణాలు చేయవచ్చా?

వాగులు, నదుల పక్కన ఇల్లు కట్టుకోవద్దని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. జల ప్రవాహాలు ఎక్కువైతే.. ఆస్తి, ప్రాణ నష్టం కలిగే ప్రమాదం ఉందన్నారు. ‘నీటి ఒత్తిడి వల్ల పునాదుల బలం తగ్గి, ఇంట్లో స్థిరత్వం లోపిస్తుంది. ప్రకృతి శక్తుల వైపరీత్యం నుంచి ఇల్లు సురక్షితంగా ఉండాలంటే, వరుణ దేవుని ఆగ్రహానికి గురికావొద్దంటే ఈ స్థలాలను నివారించాలి. భద్రత కోసం వీటికి దూరంగా ఉండటం ఉత్తమం’ అని చెప్పారు. <<-se>>#Vasthu<<>>
News November 2, 2025
అవి నిరాధార ఆరోపణలు: ప్రశాంత్ వర్మ

తనపై ఓ నిర్మాణ సంస్థ ఫిర్యాదు చేసినట్లు వస్తున్న వార్తలను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఖండించారు. అవన్నీ నిరాధారమైన, తప్పుడు ఆరోపణలని స్పష్టం చేశారు. ‘నాకు, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్కు మధ్య ఉన్న వివాదం తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ వద్ద పరిశీలనలో ఉంది. దీనిపై వారు విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటారు. అప్పటిదాకా వివాదాలు సృష్టించవద్దు’ అని ఓ ప్రకటనలో కోరారు.
News November 2, 2025
‘కాశీబుగ్గ’ తొక్కిసలాట అప్డేట్స్

* మృతుల కుటుంబాలకు కేంద్ర మంత్రి రామ్మోహన్, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు రూ.15 లక్షల చొప్పున పరిహారం అందజేశారు.
* కేంద్రం ప్రకటించిన రూ.2లక్షల ఎక్స్గ్రేషియా కూడా త్వరలో అందుతుందని రామ్మోహన్ చెప్పారు.
* పలాస ఆస్పత్రి నుంచి 15 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. మరో 11 మందికి సీహెచ్సీతో చికిత్స కొనసాగుతోంది. మెరుగైన వైద్యం కోసం ఒకరిని శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించాం: మంత్రి సత్యకుమార్ యాదవ్


