News August 19, 2024

అవును ఇంకా పనిచేస్తున్నా.. మీకేంటి సమస్య: అమితాబ్

image

81 ఏళ్ల వయసులోనూ తాను ఇంకా పనిచేస్తుండటంపై బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్‌లో తాజాగా స్పందించారు. ‘ఈ వయసులో కూడా ఎందుకు పని అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. ఎందుకు అంటే నా వద్ద నిర్దిష్టమైన జవాబేమీ లేదు. పని దొరకడం కంటే మరో కారణం ఏముంటుంది? అవును పనిచేస్తున్నా. మీకేమైనా సమస్యా? అయితే వెళ్లి మీరు కూడా పనిచేసి, నేనెందుకు పని చేస్తున్నానో తెలుసుకోండి’ అని స్పష్టం చేశారు.

Similar News

News December 13, 2025

డిసెంబర్ 13: చరిత్రలో ఈ రోజు

image

1952: దక్షిణ భారత నటి లక్ష్మి జననం
1955: కేంద్ర మాజీ మంత్రి మనోహర్ పారికర్ జననం
1960: విక్టరీ వెంకటేశ్(ఫొటోలో) జననం
1961: భారత దిగ్గజ క్రికెటర్ అలీఖాన్ పటౌడీ టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన రోజు
1986: హిందీ నటి స్మితా పాటిల్ మరణం
1990: హీరోయిన్ రెజీనా జననం
2001: భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన రోజు

News December 13, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 13, 2025

నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత అరెస్టు

image

నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత (2023) నర్గెస్‌ మొహమ్మదిని ఇరాన్ భద్రతా దళాలు అరెస్ట్‌ చేశాయి. ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించిన ప్రముఖ న్యాయవాది ఖోస్రో అలికోర్డి స్మారక కార్యక్రమానికి హాజరైనప్పుడు ఆమెతో పాటు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కాగా మహిళా హక్కుల కోసం పోరాడుతున్న ఆమె గత పదేళ్లలో ఎక్కువ కాలం జైలులోనే గడిపారు. 2024లో తాత్కాలిక బెయిల్‌పై విడుదలయ్యారు.