News February 9, 2025

నిన్న ప్లేయర్.. నేడు కామెంటేటర్

image

టీమ్ ఇండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ SA T20లో మరో అవతారం ఎత్తారు. నిన్నటి వరకు ఆటగాడిగా అలరించిన కార్తీక్ ఇవాళ జరుగుతున్న ఫైనల్ మ్యాచులో కామెంటేటర్‌గా మారారు. తోటి కామెంటేటర్లతో కలిసి కామెంట్రీ బాక్స్‌లో ఆయన సందడి చేశారు. కాగా ఈ టోర్నీలో కార్తీక్ పార్ల్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. 7 మ్యాచుల్లో 130 పరుగులు బాదారు. ఐపీఎల్ 2025లో ఆర్సీబీకి మెంటార్‌గా వ్యవహరించనున్నారు.

Similar News

News September 14, 2025

OG మూవీలో నేహాశెట్టి సర్‌ప్రైజ్

image

పవన్ కళ్యాణ్ ‘OG’మూవీపై హైప్ అంతకంతకూ పెంచేస్తున్నారు. తాజాగా ఇందులో ఓ ఐటమ్ సాంగ్ ఉందని క్లారిటీ వచ్చింది. DJ టిల్లు మూవీ ఫేమ్ నేహాశెట్టి ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా వాటిని స్వయంగా హీరోయినే కన్ఫమ్ చేశారు. ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆమె ‘OG’లో సర్‌ప్రైజ్ ఉంటుందని వెల్లడించారు. కేవలం సాంగ్ మాత్రమే కాకుండా.. పవన్‌తో కీలక సన్నివేశాల్లోనూ నటించినట్లు తెలుస్తోంది.

News September 14, 2025

నేడు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు

image

AP: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడనం, అనుబంధంగా ద్రోణి విస్తరించిందని APSDMA తెలిపింది. దాని ప్రభావంతో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురవొచ్చని చెప్పింది. శ్రీకాకుళం, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షం, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

News September 14, 2025

రూ.29 లక్షల కోట్ల GSDP లక్ష్యం: చంద్రబాబు

image

AP: ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 10.5% వృద్ధి సాధించినట్లు CM చంద్రబాబు వెల్లడించారు. ఈనెల 15,16 తేదీల్లో నిర్వహించనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌పై మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న పౌరసేవలు, సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యమన్నారు. పౌరసేవలు, సంక్షేమ పథకాలపై పబ్లిక్ పర్సెప్షన్‌ను విశ్లేషిస్తున్నామన్నారు. 2029నాటికి రూ.29 లక్షల కోట్ల GSDP లక్ష్యంగా పనిచేయాలన్నారు.