News July 13, 2024
మొన్న అయోధ్య, ఇప్పుడు బద్రీనాథ్.. బీజేపీకి భంగపాటు!

హిందుత్వ పార్టీగా ముద్రపడ్డ BJP దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అయోధ్య, బద్రీనాథ్‌లో ఓటమిపాలవడం విస్మయానికి గురిచేస్తోంది. రాముడే ప్రధాన అస్త్రంగా BJP లోక్‌సభ ఎన్నికల బరిలో దిగింది. అయోధ్య(ఫైజాబాద్ లోక్‌సభ స్థానం)లో ఆ పార్టీ అభ్యర్థి లల్లూ సింగ్‌పై SP అభ్యర్థి అవధేశ్ గెలుపొందారు. తాజాగా వెలువడిన బద్రీనాథ్ అసెంబ్లీ ఉపఎన్నికలో INC అభ్యర్థి లఖ్‌పత్ చేతిలో BJP అభ్యర్థి రాజేంద్ర సింగ్ ఓటమిపాలయ్యారు.
Similar News
News January 15, 2026
ఎయిర్‌ఫోర్స్ స్కూల్ హిండెన్‌లో ఉద్యోగాలు

ఘజియాబాద్‌లోని <
News January 15, 2026
మనోళ్లదే డామినేషన్.. ఆధార్ కార్డు vs గ్రీన్ కార్డు!

అండర్-19 WCలో INDతో ఆడుతున్న అమెరికా జట్టులోని ప్లేయర్లందరూ భారత మూలాలు ఉన్నవారే కావడం విశేషం. ఉత్కర్ష్ శ్రీవాస్తవ(C), అద్నిత్, నితీశ్, అర్జున్ మహేశ్, అమరీందర్, సబ్రిశ్, అదిత్, అమోఘ్, సాహిల్, రిషబ్, రిత్విక్ పూర్వీకులు ఇండియా నుంచి వెళ్లారు. దీంతో మనోళ్ల డామినేషన్ మామూలుగా లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది IND vs USA కాదని.. ఆధార్ కార్డు vs గ్రీన్ కార్డు అని జోకులు పేలుస్తున్నారు.
News January 15, 2026
ఈ ఫేస్ ప్యాక్‌తో ఎన్నో లాభాలు

పెరుగు, శనగపిండి, పసుపు మూడు కలిసి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నాయి. వీటిని కలిపి ప్యాక్‌లా తయారుచేసుకుని ముఖానికి, చర్మానికి పట్టించడం వల్ల సౌందర్యం పెరుగుతుంది. చర్మంపై చేరే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. చర్మంపై ముడతలు, మచ్చలు రాకుండా ఉంటాయి. కెమికల్ క్రీములు వాడే బదులు వీటిని వాడటం వల్ల చర్మ సౌందర్యాన్ని సులువుగా పెంచుకోవచ్చని చెబుతున్నారు.


