News December 29, 2024
నిన్న సమంత.. ఇవాళ కీర్తి సురేశ్.. ఇవి ఆగేదెలా?

సరికొత్త ఆవిష్కరణలకు అండగా ఉండాల్సిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ను కొందరు విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారు. నిన్న హీరోయిన్ <<15004135>>సమంత <<>>బేబీ బంప్తో ఉన్న ఫొటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయగా, తాజాగా మరో నటి కీర్తి సురేశ్ ఫొటోలనూ గర్భంతో ఉన్నట్లు క్రియేట్ చేశారు. దీంతో ఇలాంటివి క్రియేట్ చేసే వారికి AIని దూరంగా ఉంచాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Similar News
News December 6, 2025
కాకర పంటను ఇలా సాగు చేస్తే మంచిది

కాకర పంటను పందిరి విధానంలో సాగు చేస్తే పంట నాణ్యతగా ఉండి, మార్కెట్లో మంచి ధర దక్కుతుంది. అలాగే దిగుబడి 40-50శాతం పెరుగుతుంది. కాకరను సారవంతమైన ఒండ్రు నేలలు, ఎర్ర గరప నేలల్లో మాత్రమే సాగు చేయాలి. డ్రిప్ ద్వారా ఎరువులను అందిస్తే, ఎరువుల ఆదాతో పాటు, పెట్టుబడి కూడా కొంత తగ్గుతుంది. రసాయన పురుగు మందులే కాకుండా వేప ఉత్పత్తులతో కూడా చీడలను సంపూర్ణంగా నివారించి ఎకరాకు 10 టన్నులకు పైగా దిగుబడి పొందవచ్చు.
News December 6, 2025
ఇవాళ మెగా జాబ్ మేళా

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయనగరంజిల్లా రాజాంలో ఇవాళ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీఈ, బీటెక్, పీజీ ఉత్తీర్ణులైన, 18- 40ఏళ్ల వయసు గలవారు GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు. అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.inలో పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 35 MNCలు నిరుద్యోగులను రిక్రూట్ చేసుకోనున్నాయి.
News December 6, 2025
‘మహానటి’ నుంచి ఈతరం ఏం నేర్చుకోవాలంటే?

మహానటి సావిత్రి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎంత స్టార్డమ్ వచ్చినా మూలాలను మర్చిపోకుండా సాధారణ నటిగానే మెలిగారు. ప్రత్యేక ఏర్పాట్లు, సెపరేట్ స్టాఫ్, అనవసరపు ఖర్చులతో ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టలేదు. జూనియర్ ఆర్టిస్టులతో కలివిడిగా ఉండేవారు. యూనిట్ సభ్యులను బాగా చూసుకునే వారు. క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తూ వెండితెరపై ఓ వెలుగు వెలిగారు. ఇవాళ సావిత్రి 90వ జయంతి.


