News March 18, 2024
నిన్నటి ‘ప్రజాగళం’ పూర్తిగా విఫలం: సజ్జల
AP: పదేళ్ల తర్వాత కొత్త నాటకానికి తెరలేపారని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. ‘ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులు పెట్టుకోవడం.. హామీలు ఇవ్వడం వీరికి అలవాటుగా మారింది. వాటిని నెరవేర్చకుండా తిరిగి ఏ ముఖం పెట్టుకుని కలిశారు? అధికారంలోకి రావాలనే ఆత్రుత చంద్రబాబుకు ఎక్కువైంది. నిన్నటి ‘ప్రజాగళం’ సభ పూర్తిగా విఫలమైంది’ అని అన్నారు.
Similar News
News January 8, 2025
సినిమాల్లో సక్సెస్ అవ్వకపోతే?.. రామ్ చరణ్ అన్సర్ ఇదే
చిన్నప్పటి నుంచి ఇంట్లో సినిమా ప్రభావం తమపై పడకుండా నాన్న చిరంజీవి జాగ్రత్తలు తీసుకున్నారని హీరో రామ్ చరణ్ అన్నారు. ఆ తర్వాత తన మార్కులు చూసి ఏమవుతావని తన తండ్రి అడిగితే సినిమాల్లోకి వస్తానని చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఒకవేళ సినిమాల్లో సక్సెస్ అవ్వకుంటే ప్లాన్-బి ఏమీ లేదన్నారు. డూ ఆర్ డై ఏదైనా ఇక్కడే అనుకున్నానని తెలిపారు. కాగా ఆయన నటించిన ‘గేమ్ ఛేంజర్’ ఎల్లుండి రిలీజ్ కానుంది.
News January 8, 2025
BREAKING: త్వరలో సర్పంచ్ ఎన్నికలు: సీఎం
తెలంగాణలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో భేటీలో సూచించారు. ఈ నెల 26న రైతు భరోసా ఇస్తున్నామని, రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేలు అందిస్తామని, రూ.21వేల కోట్ల రుణమాఫీ చేశామని పీసీసీ చీఫ్‌కు సీఎం వివరించారు. కాగా బీసీ రిజర్వేషన్లపై నివేదిక వచ్చాక ఎన్నికలు జరిగే అవకాశముంది.
News January 8, 2025
గవర్నర్‌కు కిషన్ రెడ్డి ఫిర్యాదు
TG: హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంపై దాడి ఘటనపై గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు కిషన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వందలాది కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై కర్రలు, రాళ్లతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిలో బీజేపీ నాయకులు గాయపడ్డారని, రాజకీయ ప్రత్యర్థులను అధికార పార్టీ భయభ్రాంతులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పాలన అందించేలా ప్రభుత్వానికి సూచించాలని కోరారు.