News February 1, 2025

YGT: ఈసారైనా బడ్జెట్లో మోక్షం కలిగేనా…!

image

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. దశాబ్దాల కాలం నుంచి నూతన రైల్వే లైన్ల కోసం నల్గొండ జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. శంషాబాద్ -SRPT – VJD హై స్పీడ్ రైల్వే లైన్, డోర్నకల్-SRPT-NLG-గద్వాల్ రైల్వే లైన్ కోసం గత ఏడాది సర్వే చేశారు. డోర్నకల్-MLG రైల్వే లైన్, హైదరాబాద్-యాదాద్రి ఎంఎంటీఎస్ రైలుపై బడ్జెట్లో ప్రకటన ఉంటుందో లేదో మరి చూడాలి.?

Similar News

News October 25, 2025

బాలానగర్: రఘునందన్‌పై శ్రీనివాస్ గౌడ్ గెలుపు

image

బాలానగర్‌లోని MTAR Technologies Ltd కంపెనీలో శనివారం యూనియన్ ఎన్నికలు జరిగాయి. కార్మికుల గుర్తింపు పొందిన భారత ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుపై గెలుపొందారు. తనపై నమ్మకంతో గెలిపించిన కార్మికులందరికీ శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీలో కార్మికులకు ఉన్న ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

News October 25, 2025

తుపాన్ హెచ్చరికలు.. కలెక్టర్ సమీక్ష

image

తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులతో సమీక్షించారు. 1513 చెరువుల గట్ల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని, ఇసుక బస్తాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లా, మండలాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, తీవ్ర గాలుల సమయంలో బయటకు రావద్దని, నదుల్లోకి వెళ్లవద్దని కోరారు.

News October 25, 2025

జూబ్లీలో ఈసీ రూల్స్ ఫాలో కావాలి: సంజీవ్ కుమార్ లాల్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలను తప్పక పాటించాలని వ్యయ పరిశీలకుడు సంజీవ్ కుమార్ లాల్ అన్నారు. శనివారం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారానికి చేసే ప్రతి పైసాను ఎన్నికల సంఘంకు తెలపాలన్నారు. ఖర్చులకు సంబంధించి పక్కగా డాక్యుమెంటేషన్ చేసుకోవాలని సంజీవ్ కుమార్ లాల్ స్పష్టం చేశారు.