News February 8, 2025
YLR: గీత దాటారు.. పార్టీ నుంచి వైదొలగారు

ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి పార్టీ నుంచి తొలగించారు. గత కొన్ని నెలల కింద కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ క్రమశిక్షణ అధ్యక్షుడు చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని తేల్చి చెప్పారు. కాగా సుభాష్ రెడ్డి రెండేళ్లలో పార్టీ నుంచి సస్పెండ్ కావడం ఇది రెండోసారి.
Similar News
News April 17, 2026
పునాదికే రూ. 50 లక్షలు స్వాహా.. బందరు MP షాక్!

మచిలీపట్నం బలరాముని పేటలో యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణం వివాదస్పదమైంది. MP బాలశౌరి మంజూరు చేసిన రూ. 50 లక్షల నిధులను నిర్వాహకులు కేవలం పునాది (ఫౌండేషన్) కోసమే ఖర్చు చేయడంతో ఆయన విస్మయానికి గురయ్యారు. దీనిపై నివేదిక కోరినా స్పందన లేకపోవడంతో MP తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ వైరం పెరుగుతుందనే ఆందోళనతో లోలోన మదనపడుతూ మౌనం వహిస్తున్నట్లు సమాచారం.

అనంతగిరి: గిరిజన సంప్రదాయాలకు జేసీ వినయ నమస్కారం

అనంతగిరి మండలంలో జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ పర్యటనలో గురువారం ప్రత్యేక ఘటన చోటుచేసుకుంది. రొంపల్లి పంచాయతీ బురిగా, చినకొనేల గ్రామాల్లో గిరిజనులు తమ సంప్రదాయం ప్రకారం కూర్చొని నమస్కారం చేశారు. దీనిని గౌరవించిన జేసీ కూడా నేలపై కూర్చొని వారికి నమస్కారం చేయడం అందరినీ ఆకట్టుకుంది. అధికార హోదాను పక్కనబెట్టి గిరిజన సంప్రదాయాలను ఆదరించిన ఆమె వినయం స్థానికుల్లో ప్రశంసలు అందుకుంది.