News August 27, 2025

నెలాఖరున రోహిత్, రాహుల్‌‌కు యోయో టెస్ట్?

image

ఈ నెల 30-31 తేదీల్లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌కు అగ్ని పరీక్ష ఎదురుకానుంది. ఆ రోజుల్లో వారు యోయో టెస్ట్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. దీంతో ఈ టెస్టును క్లియర్ చేసేందుకు ఇద్దరూ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. కాగా ఆటగాళ్ల ఫిట్‌నెస్ కోసం బీసీసీఐ యో యో టెస్ట్ నిర్వహిస్తోంది. ఆటగాళ్లను మరింత ఫిట్, స్ట్రాంగ్‌గా ఉంచేందుకు ఈ టెస్ట్ ఉపయోగపడుతుందని బోర్డు విశ్వసిస్తోంది.

Similar News

News August 27, 2025

అప్పుడే రూట్ పెద్ద ప్లేయర్ అవుతాడనుకున్నా: సచిన్

image

ఇంగ్లండ్ క్రికెటర్ రూట్ పెద్ద ప్లేయర్ అవుతారని 2012లో అనుకున్నట్లు సచిన్ చెప్పారు. నాగ్‌పూర్‌లో తొలి టెస్ట్ ఆడుతున్న రూట్‌ను చూసి ఇంగ్లండ్ భవిష్యత్తు కెప్టెన్ అని సహచరులతో చెప్పినట్లు రెడిట్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఆయన స్ట్రైక్ రొటేట్ చేసే విధానం ఆకట్టుకుందని చెప్పారు. టెస్టుల్లో 13వేల పరుగులు చేయడం అద్భుతమని కొనియాడారు. ఈ ఫార్మాట్‌లో సచిన్ రికార్డుకు రూట్ ఇంకా 2,379 పరుగుల దూరంలో ఉన్నారు.

News August 27, 2025

ఆ దేశాలతో చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాలు: ట్రంప్

image

యూకే, చైనా, ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, జపాన్, దక్షిణ కొరియా, EU దేశాలతో చారిత్రాత్మక ఒప్పందాలు చేసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఆయా దేశాలు బిలియన్ల డాలర్లు US ట్రెజరీకి చెల్లిస్తున్నాయని పేర్కొన్నారు. అటు భారత్‌పై ఇప్పటికే 25% టారిఫ్స్ ఉండగా అదనంగా విధించిన టారిఫ్స్ IST ప్రకారం ఇవాళ ఉ.9.31 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో భారత ఎగుమతులపై టారిఫ్స్ 50శాతానికి చేరుతాయి.

News August 27, 2025

ఎంగేజ్మెంట్ చేసుకున్న సింగర్ టేలర్ స్విఫ్ట్

image

ప్రముఖ అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ తన ప్రియుడిని పెళ్లి చేసుకోనున్నారు. NFL ప్లేయర్ ట్రావిస్ కెల్సేతో రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ బ్యూటీ నిన్న ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు IGలో పోస్ట్ చేశారు. ‘మీ ఇంగ్లిష్ టీచర్, జిమ్ టీచర్ వివాహం చేసుకోబోతున్నారు’ అని రాసుకొచ్చారు. తనను తాను ఇంగ్లిష్ టీచర్‌గా టేలర్ పేర్కొనడంపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. వీరి పెళ్లి ఎప్పుడనే విషయాన్ని వెల్లడించలేదు.