News November 8, 2024
‘యోగా’ టెక్నిక్ ఆమె ప్రాణాలను కాపాడింది
బెంగళూరులో యోగా టీచర్ అర్చన(35) బ్రీత్ కంట్రోల్ ప్రతిభతో చావు నుంచి తప్పించుకుంది. ఆమెకు తన భర్తతో అక్రమ సంబంధం ఉందని బిందు అనే మహిళ అనుమానించింది. అర్చనను చంపేందుకు కొందరికి సుపారీ ఇచ్చింది. వారు ఆమెను తీవ్రంగా కొట్టి అడవికి తీసుకెళ్లారు. అర్చన తన యోగా ప్రతిభతో శ్వాసను నియంత్రించుకుని చనిపోయినట్లు నటించడంతో దుండగులు వదిలేసి వెళ్లిపోయారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను అరెస్టు చేశారు.
Similar News
News November 8, 2024
Unusual: అదృష్టం తెచ్చిన కారుకు ఘనంగా అంత్యక్రియలు
18 ఏళ్ల క్రితం కొన్న మారుతి వ్యాగనార్ కారు గుజరాత్లోని అమ్రేలి జిల్లాకు చెందిన సంజయ్ పోల్రా జీవితాన్ని మార్చేసింది. 2006లో ప్రాప్టరీ బ్రోకర్గా ఉండగా కొన్న ఈ కారు తనను బిల్డర్ స్థాయికి తెచ్చిందని సంజయ్ గర్వంగా చెప్పారు. ఇప్పుడు ఆడి కారులో తిరిగేలా తన అదృష్టాన్ని మార్చేసిందన్నారు. తాజాగా కారు షెడ్డుకు చేరడంతో మంత్రోచ్ఛారణల మధ్య 1,500 మంది సమక్షంలో దాన్ని 15 అడుగుల గొయ్యిలో పాతిపెట్టారు.
News November 8, 2024
అభిషేక్.. ఇలా అయితే కష్టమే!
టీమ్ఇండియా యువ బ్యాటర్ అభిషేక్ శర్మ వచ్చిన అవకాశాలను వృథా చేసుకుంటున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా విఫలమవుతూ వస్తున్నారు. జింబాబ్వేపై సెంచరీ మినహా మిగతా మ్యాచుల్లో 0, 10, 14, 16, 15, 4, 7 (ఇవాళ సౌతాఫ్రికాపై) స్వల్ప పరుగులకే వెనుదిరిగి నిరాశపరిచారు. రాబోయే మ్యాచుల్లో అయినా అతను రాణించాలని, లేదంటే జట్టులో చోటు కోల్పోయే ఛాన్సుందని పలువురు క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
News November 8, 2024
46 రోజుల్లో భూమిని చుట్టేసే పక్షి!
ఆల్బట్రాస్ అనే పక్షి భూమిని 46 రోజుల్లోనే చుట్టి వస్తుంది. బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే పేరిట పక్షి జాతుల పరిశోధకులు 2005లో వీటిపై అధ్యయనం నిర్వహించారు. ఆ జాతికి చెందిన 22 పక్షులకు ట్రాకింగ్ పరికరాల్ని అమర్చి వాటి వలస మార్గాల్ని ట్రాక్ చేశారు. దక్షిణ అట్లాంటిక్లోని దక్షిణ జార్జియా నుంచి వలసకు బయలుదేరిన ఆల్బట్రాస్లలో కొన్ని పక్షులు 46 రోజుల్లో భూమిని చుట్టి వచ్చినట్లు ఆ అధ్యయనంలో తేలింది.