News October 20, 2024
మూడోసారీ యోగినే యూపీ సీఎం: జ్యోతిషుడు అనిరుధ్

ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ మరోసారి గెలుస్తుందని ప్రముఖ జ్యోతిషుడు అనిరుధ్ కుమార్ మిశ్రా అంచనా వేశారు. ‘ప్రస్తుత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2027 ఎన్నికల్లో విజయం సాధిస్తారు’ అని ఆయన ట్వీట్ చేయగా వైరలవుతోంది. అంతేకాకుండా మహారాష్ట్రలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ NDA విజయం సాధిస్తుందని చెప్పారు.
Similar News
News January 28, 2026
గ్రూప్-2 ఫలితాలు విడుదల

AP: ఎట్టకేలకు 2023 గ్రూప్-2 రిజల్ట్స్ గత అర్ధరాత్రి విడుదలయ్యాయి. 905 పోస్టుల నోటిఫికేషన్‌కు APPSC 891 మందిని ఎంపిక చేసింది. స్పోర్ట్స్ కోటాపై HC ఆదేశాలతో 2 పోస్టులు పక్కన పెట్టగా, దివ్యాంగ, రిజర్వేషన్ కేటగిరీల్లో అభ్యర్థులు లేక 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా కోర్టు తీర్పుకు లోబడి నియామకాలు ఉంటాయని కమిషన్ పేర్కొంది.
– ఇక్కడ ఒక్క క్లిక్ చేసి ఈ రిజల్ట్ నేరుగా <
Share It
News January 28, 2026
జీడిమామిడిలో టీ దోమ, ఆంత్రాక్నోస్ కట్టడికి సూచనలు

ప్రస్తుతం చాలా జీడిమామిడి తోటల్లో పూత, పిందెలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో జీడిమామిడి పంటను టీ దోమ ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు మొదటి దఫాలో లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6ml కలిపి పిచికారీ చేయాలి. దీంతో పాటు ఈ సమయంలో ఆంత్రాక్నోస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీని నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రాములు లేదా కార్బండిజమ్+ మ్యాంకోజెబ్ 2.5గ్రా కలిపి పిచికారీ చేయాలి.
News January 28, 2026
నేడు వైజాగ్‌లో 4th టీ20.. జట్టులో మార్పులు?

భారత్, న్యూజిలాండ్ మధ్య 4th T20 మ్యాచ్ నేడు వైజాగ్ వేదికగా జరగనుంది. సిరీస్‌ను IND ఇప్పటికే 3-0తో కైవసం చేసుకోవడంతో ఈ మ్యాచులో ప్రయోగాలు చేయొచ్చు. హార్దిక్, హర్షిత్‌కు రెస్ట్ ఇచ్చి అక్షర్, అర్ష్‌దీప్‌ను ఆడించే అవకాశముంది. తొలి 3 మ్యాచుల్లో ఫెయిలైన శాంసన్ ఈరోజు రాణిస్తారా? శ్రేయస్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా? అనే దానిపై ఆసక్తి నెలకొంది.
LIVE: 7PM నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో.


