News March 25, 2024

మరో బాలరాముడి విగ్రహాన్ని తయారుచేసిన యోగిరాజ్

image

అయోధ్య బాలరాముడి విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్ మరో చిన్నారి రాముడి విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విషయాన్ని తన ట్విటర్‌ హ్యాండిల్‌లో షేర్ చేశారు. అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని చెక్కిన సమయంలో దీనిని రూపొందించడం గమనార్హం. రామ్ లల్లా విగ్రహ తయారీతో యోగిరాజ్ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు.

Similar News

News April 5, 2026

భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ చోరీకి వైసీపీ ప్రయత్నం: కొండపల్లి

image

భోగాపురం విమానాశ్రయ క్రెడిట్‌ను వైసీపీ తమదిగా చూపించుకునే ప్రయత్నం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కాలంలోనే శంకుస్థాపన జరిగి సుమారు 2,600 ఎకరాల భూసేకరణ పూర్తయిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో కేవలం 300 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేశారని, ఆ నిర్వాసితులకు ఇప్పటికీ న్యాయం చేయలేదని ఆరోపించారు.

News April 5, 2026

భద్రాచలం పక్కనున్న 5 గ్రామాలను TGలో కలపండి: తుమ్మల

image

భద్రాచలం పక్కన ఉన్న 5 గ్రామాలను ఏపీ నుంచి తెలంగాణలో కలపాలని కేంద్రాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోరారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ‘పాలనా సౌలభ్యం కోసం పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం గ్రామాలను తిరిగి తెలంగాణలో చేర్చండి. అలాగైతేనే గిరిజనుల సమస్యలు తొలగిపోతాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే విలీనం బిల్లు పెట్టేలా చూడండి’ అని కోరారు.

News April 5, 2026

‘ధురంధర్’ తెర వెనుక హీరోలకు థాంక్స్: సారా అర్జున్

image

ధురంధర్ 2 భాగాలు సూపర్ హిట్ కావడంలో కీలక పాత్ర పోషించిన టెక్నీషియన్స్‌కు హీరోయిన్ సారా అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. ‘ఆదిత్య ధర్‌ను తొలిసారి చూసినప్పుడే ప్రత్యేకంగా ఏదో చేస్తారనుకున్నా. ఆయనతోపాటు దర్శకత్వ బృందం ఎంతో కృషి చేసింది. నిర్మాతలు, DOP, క్యాస్టింగ్ డైరెక్టర్.. ఇంకా ఎంతో మంది ఈ మూవీకి వెన్నెముకలా తెర వెనుక చెమటోడ్చారు. మీ అందరికీ థాంక్స్. చరిత్ర సృష్టించాం’ అని ఇన్‌స్టాలో పేర్కొన్నారు.