News November 28, 2024

మహిళలూ మీరంతా నాకు స్ఫూర్తి: కేటీఆర్

image

TG: రాష్ట్రంలో వివిధ సమస్యలపై పోరాడుతున్న మహిళలు తనకు స్ఫూర్తి అని KTR తెలిపారు. ‘సమ్మక్కలు, సారక్కలు. మొక్కవోని ధైర్యంతో ముందుకురుకుతున్న ఐలమ్మలు. అలుపెరగని పోరాటం చేస్తున్న రుద్రమ్మలు. మీరంతా నాకు స్పూర్తి. ఒక సోదరుడిగా మీకు అండగా ఉంటాను’ అని ట్వీట్ చేశారు. హైడ్రా, గురుకులాలు, బెటాలియన్‌ కానిస్టేబుళ్ల సమస్యలు, దిలావర్ పూర్‌లో ఇథనాల్ పరిశ్రమపై నిరసనలకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు.

Similar News

News October 20, 2025

దీపాలు వెలిగించేటపుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

ఆనందకరమైన దీపావళి పండగను జరుపుకొనే సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. దీపాలకు తగులుతాయి అనుకున్న కర్టెన్లను వీలైతే కొన్నిరోజుల పాటు తీసి పక్కన పెట్టేయండి. దుస్తులు దీపాలకు అంటకుండా చూసుకోవాలి. లూజుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. పిల్లలు బాణసంచా కాలుస్తుంటే పక్కనే పెద్దవాళ్లు ఉండాలి. టపాసులు కాల్చేటపుడు షూ, కళ్లజోడు ధరించాలి. కాకర్స్‌ను దీపాలకు దూరంగా పెట్టుకోవాలి.

News October 20, 2025

రాష్ట్రంలో 97 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్‌లో వివిధ విభాగాల్లో 97 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. వైద్య విద్య ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45 ఏళ్లు. రిజర్వేషన్ గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల సమాచారం కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 20, 2025

గాల్లో విమాన అద్దం ధ్వంసం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

image

డెన్వర్(US) నుంచి లాస్‌ఏంజెలిస్ వెళ్తున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం ఘోర ప్రమాదం తప్పించుకుంది. గాల్లో 36 వేల ఫీట్ల ఎత్తులో ఉన్న సమయంలో కాక్‌పిట్ విండ్‌షీల్డ్(అద్దం) పగిలిపోయి పైలట్‌కు గాయాలయ్యాయి. ఆయన వెంటనే అప్రమత్తమై ల్యాండ్ చేయడంతో 140 మంది ప్రయాణికులు, సిబ్బంది సేఫ్‌గా బయటపడ్డారు. పైలట్ చేతిపై కాలిన గాయాలు ఉండటంతో ఉల్క ఢీకొట్టి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.