News April 2, 2025
నువ్వు దేవుడు సామీ.. వంటమనిషికి రూ.కోటి!

దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా వీలునామా గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనకు ఎప్పటి నుంచో వండిపెడుతున్న కుక్ రజన్ షాకు రూ.కోటి ఇచ్చారు. ఇంటి పనులు చేసే సుబ్బయ్యకు రూ.66 లక్షలు, సెక్రటరీ డెల్నాజ్కు రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు. తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకు ఉన్న రూ.కోటి రుణాన్ని మాఫీ చేశారు. రతన్ టాటాకు రూ.10వేల కోట్ల ఆస్తులుండగా, రూ.3800 కోట్లను దానధర్మాలకు ఇచ్చేశారు.
Similar News
News April 3, 2025
టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులకు అలర్ట్

TG: వార్షిక పరీక్షలు రాసిన టెన్త్ విద్యార్థులకు రేపు కెరీర్ గైడెన్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. రేపు ఉ.10-12 గంటల వరకు T-SAT, యూట్యూబ్ ఛానెల్లో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడం, కెరీర్ ఆప్షన్స్ వంటి విషయాలపై సీనియర్ ఐఏఎస్ అధికారులు అవగాహన కల్పిస్తారు.
News April 3, 2025
నార్త్ సెంటినల్ ఐలాండ్‌లోకి US వ్యక్తి.. అరెస్ట్

అండమాన్ నికోబార్‌లోని నార్త్ సెంటినల్ దీవిలోకి ఎంటరైన US వ్యక్తి పోల్యకోవ్ (24)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ అతడు అక్కడి గిరిజనులు కంటికి చిక్కలేదు. తిరిగి వచ్చే సమయంలో ఓ మత్స్యకారుడు చూసి పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో ధలివాల్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కాగా సెంటినల్ దీవుల్లోకి ఎవరైనా వెళ్తే అక్కడి గిరిజనులు చంపేస్తారు. భారత ప్రభుత్వం దాన్ని నిషేధిత ప్రదేశంగా గుర్తించింది.
News April 3, 2025
RCBని దెబ్బకొట్టిన సిరాజ్

ఏడేళ్ల పాటు ఆర్సీబీ తరఫున ఆడిన సిరాజ్ (GT) నిన్న మ్యాచ్ విన్నింగ్ స్పెల్‌తో ఆ జట్టునే దెబ్బ తీశారు. చిన్నస్వామి స్టేడియంలో తన బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేశారు. 4 ఓవర్లలో 19 రన్స్ మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టారు. ఆఖర్లో జోరు మీదున్న లివింగ్‌స్టన్‌ను ఔట్ చేసి భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు. మెగా వేలంలో ఆర్సీబీ సిరాజ్‌ను రిటైన్ చేసుకోలేదు. ఇప్పుడు ఆయనే ఆ జట్టుపై MOMగా నిలవడం విశేషం.