News June 30, 2024
మీరు అలా.. మేం ఇలా!

T20WC గెలిచిన అనంతరం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్శర్మ ట్రోఫీని గుండెలకు హత్తుకొని విజయాన్ని ఆస్వాదించారు. కాగా ఈ నేపథ్యంలోనే గతేడాది వరల్డ్ కప్పై ఆస్ట్రేలియా క్రికెటర్ మార్ష్ కాళ్లు పెట్టిన క్షణాలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు మార్ష్ అందరి మనసును గాయపరిస్తే ఇప్పుడు రోహిత్ అందరి హృదయాలు గెలుచుకున్నారని అభిప్రాయపడుతున్నారు. కల్చర్ పరంగా ఇద్దరి మధ్య ఉన్న తేడా ఇదేనని అంటున్నారు.
Similar News
News December 18, 2025
ఫ్లాట్గా మొదలైన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్గా మొదలయ్యాయి. నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో 25,779 వద్ద, సెన్సెక్స్ 150 పాయింట్ల నష్టంతో 84,403 వద్ద కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఐటీసీ లాభాల్లో, టాటా మోటార్స్, సన్ ఫార్మా, టాటా స్టీల్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాక్, మారుతి, ఎల్అండ్టీ నష్టాల్లో నడుస్తున్నాయి.
News December 18, 2025
ముర్రా జాతి గేదెల ప్రత్యేకతలు ఇవే

ముర్రా జాతి గేదెలు హర్యానా, పంజాబ్ ప్రాంతాలకు చెందినవి. వీటి శరీరం ముందు భాగం సన్నగా, వెనుక భాగం లావుగా V(వీ) ఆకారంలో ఉంటుంది. దీని వల్ల ఇవి తక్కువ ఆహారం తీసుకొని ఎక్కువ పాలను ఇస్తాయి. ఒక ముర్రా గేదె రోజుకు 14 నుంచి 20 లీటర్ల పాలు ఇస్తుంది. మేలైన జాతి గేదెలు రోజుకు 25-30 లీటర్ల వరకు పాలు ఇచ్చే ఛాన్సుంది. ఒక ఈత కాలంలో ఇవి సుమారు 270-300 రోజులు పాలు ఇస్తాయి. పాలలో వెన్న 7 నుంచి 9 శాతంగా ఉంటుంది.
News December 18, 2025
అణు రంగంలోకి ప్రైవేట్ సంస్థలు.. ‘శాంతి’ బిల్లుకు LS ఆమోదం

‘అణు రంగం’లోకి ప్రైవేట్ సంస్థల్ని అనుమతించడానికి కేంద్రం తీసుకువచ్చిన ‘శాంతి(SHANTI)’ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. దీనిని దేశాభివృద్ధి ప్రయాణానికి కొత్త దిశానిర్దేశం చేసే ఒక ‘మైల్ స్టోన్’ చట్టంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అభివర్ణించారు. దీంతో ప్రైవేటు సంస్థల పెట్టుబడులు పెరుగుతాయన్నారు. అయితే ఈ బిల్లు పౌర అణు నష్టపరిహార చట్టం-2010లోని నిబంధనల్ని నీరుగార్చేలా ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.


