News November 7, 2024

సర్టిఫికెట్స్, ఆధార్‌లో పేర్లు వేరుగా ఉన్నా అప్లై చేసుకోవచ్చు

image

టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులపై పేర్లలో అక్షరం తేడా ఉన్నా JEE మెయిన్‌కు దరఖాస్తు చేసుకోలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్‌లో ఇంటిపేరు సంక్షిప్తంగా ఉన్నా ఇదే సమస్య ఎదురవుతోంది. దీంతో సాఫ్ట్‌వేర్‌లో NTA మార్పులు చేసింది. పేర్లు మిస్‌మ్యాచ్ అయినట్లు చూపే పాప్ అప్ బాక్స్‌ను మూసేస్తే కొత్త విండో ఓపెనవుతుందని తెలిపింది. అందులో ఆధార్‌పై ఉన్న వివరాలు నమోదు చేయాలని పేర్కొంది.

Similar News

News February 5, 2026

WPL-2026: ఫైనల్ క్వీన్ ఎవరో?

image

WPL-2026లో ఇవాళ ఢిల్లీ, బెంగళూరు మధ్య వడోదర వేదికగా ఫైనల్ జరగనుంది. వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరిన ఢిల్లీ తొలి టైటిల్‌పై కన్నేసింది. ఈ సీజన్‌లో ఆరు విజయాలతో టేబుల్ టాపర్‌గా ఉన్న RCB రెండో సారి ట్రోఫీ నెగ్గాలని చూస్తోంది. ఇరు జట్లు 9 సార్లు తలపడగా ఆరు విజయాలతో ఢిల్లీదే పైచేయిగా ఉంది. అయినా 2024 ఫైనల్లో ఆర్సీబీ చేతిలో ఓడటం DCని కలవరపరుస్తోంది.
మ్యాచ్: 7.30pm, లైవ్: జియో హాట్‌స్టార్, Star Sports.

News February 5, 2026

ఫిరాయింపు ఆరోపణలు.. ఆ ఇద్దరే బాకీ!

image

TG: ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది MLAలలో 8 మందికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. పోచారం శ్రీనివాస్, సంజయ్, గూడెం మహిపాల్, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాశ్ గౌడ్, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ పార్టీ మారారంటూ దాఖలైన పిటిషన్లను ఆయన కొట్టివేశారు. ఇంకా దానం నాగేందర్, కడియం శ్రీహరి మిగిలారు. దానం అనర్హత పిటిషన్‌పై ఈ నెల 18కి, కడియంకు 19కి విచారణను స్పీకర్ వాయిదా వేశారు.

News February 5, 2026

కల్తీ నెయ్యి కేసు.. ఇవాళ సీఎంతో పవన్, మాధవ్ భేటీ!

image

AP: కల్తీ నెయ్యి వ్యవహరంపై సీఎం చంద్రబాబు నివాసంలో ఇవాళ కీలకం సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ భేటీ కానున్నట్లు సమాచారం. ఈ నెల 3న జరిగిన క్యాబినెట్ భేటీలో అసలు సూత్రధారులను పట్టుకునేందుకు విచారణ కమిషన్ ఏర్పాటుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.