News October 12, 2025
పరీక్ష రాశాక ఆన్సర్ షీట్ చూసుకోవచ్చు

పోటీ పరీక్షల్లో పారదర్శకత కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ముఖ్య సంస్కరణలు చేసింది. ఇకపై మెరిట్ లిస్టును మార్కులుగా కాకుండా పర్సంటైల్‌గా వెల్లడిస్తుంది. అటు పేపర్ లీకేజీలు జరగకుండా డిజిటల్ వాల్టులు వినియోగించనుంది. ఇక ఆధార్ గుర్తింపుతో అభ్యర్థుల అటెండెన్స్ తీసుకుంటుంది. ముఖ్యంగా ఎగ్జామ్‌లో తమకు వచ్చిన క్వశ్చన్ పేపర్, ఇచ్చిన ఆన్సర్స్, కీ కాపీలను పరీక్ష తర్వాత ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చని తెలిపింది.
Similar News
News October 12, 2025
HSCC లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

హాస్పిటల్ సర్వీసెస్ కన్సల్టెన్సీ కార్పొరేషన్(HSCC)లిమిటెడ్‌లో 27 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఎంబీఏ, ఇంజినీరింగ్ డిగ్రీ, ఫార్మసీ డిగ్రీ, పీజీ డిప్లొమా, LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజినీరింగ్ పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: http://hsccltd.co.in/
News October 12, 2025
దీపావళి ఆఫర్లు ప్రకటించిన టాటా, హ్యుందాయ్

దీపావళి సందర్భంగా పలు ఆటోమొబైల్ కంపెనీలు ఆఫర్లు ప్రకటించాయి. అక్టోబర్ 21 వరకు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్‌ఛైంజ్ ఆఫర్లు, లాయల్టీ బోనస్‌లు ఉంటాయని టాటా మోటార్స్ తెలిపింది. టియాగోపై రూ.20-30వేలు, నెక్సాన్‌పై రూ.35వేలు, పంచ్‌పై రూ.25వేలు డిస్కౌంట్ ఇస్తున్నట్లు పేర్కొంది. అటు హ్యుందాయ్ కంపెనీ సైతం వివిధ కార్లపై ఆఫర్లు ప్రకటించింది. జీఎస్టీ తగ్గింపు, తాజా డిస్కౌంట్లతో కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి.
News October 12, 2025
ఆ ఒక్క తప్పు వల్ల ఇందిర బలయ్యారు: చిదంబరం

‘ఆపరేషన్ బ్లూస్టార్’(1984)లో జరిగిన తప్పు వల్ల మాజీ PM ఇందిర తన ప్రాణాలను మూల్యంగా చెల్లించుకున్నారని కాంగ్రెస్ నేత చిదంబరం వ్యాఖ్యానించారు. ‘మిలిటరీ ఆఫీసర్లను అగౌరవపరచాలని కాదు కానీ.. గోల్డెన్ టెంపుల్‌ను స్వాధీనం చేసుకునేందుకు అది సరైన మార్గం కాదు. ఆర్మీని దూరంగా ఉంచి టెంపుల్‌ను ఎలా అధీనంలోకి తెచ్చుకోవాలో మేం తర్వాత చూపించాం. Op Blue Star అనేది ఉమ్మడి నిర్ణయం. ఇందిరనే బ్లేమ్ చేయలేం’ అని అన్నారు.