News August 16, 2024

వండకపోయినా ఈ రైస్ తినొచ్చు!

image

అసలు వండకుండానే అన్నం రెడీ అయ్యే ప్రత్యేక రకం రైస్ ఉందనే విషయం మీకు తెలుసా? అస్సాంలో లభించే ‘బోకా సౌల్’ రకం బియ్యాన్ని 30 ని. నానపెడితే చాలు రైస్ రెడీ అయిపోతుంది. ఇది విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రొటీన్లతో కూడినది. 17వ శతాబ్దంలో మొఘల్‌లతో పోరాడే సమయంలో సైనికులు వీటిని వినియోగించేవారు. త్వరగా జీర్ణం అవుతుంది. ఇది ఎమర్జెన్సీ ఫుడ్‌గా ఉపయోగపడుతుంది. 2019లో GI ట్యాగ్ కూడా లభించింది.

Similar News

News December 6, 2025

రూ.100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్

image

AP: అతి తక్కువ ధరకే వారసత్వ వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నామమాత్రపు స్టాంపు డ్యూటీ వసూలుతో రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తూ తాజాగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ రూ.10 లక్షలలోపు ఉంటే రూ.100, దానికంటే ఎక్కువైతే రూ.1,000 స్టాంపు డ్యూటీ వసూలు చేస్తారు. భూ యజమాని మరణించిన తర్వాత వారసులకు సంక్రమించిన ఆస్తులకే ఈ రాయితీ వర్తిస్తుంది.

News December 6, 2025

కొక్కెర వ్యాధి – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

కోళ్ల షెడ్డును శుభ్రంగా ఉంచి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. సంతలో కొన్న పెట్టలను, పుంజులను టీకాలు వేయకుండా షెడ్డులో కోళ్లతో కలిపి ఉంచకూడదు. పెద్ద, చిన్న కోళ్లను వేరువేరుగా ఉంచాలి. వెటర్నరీ నిపుణుల సూచనలతో కోడిపిల్లలు పుట్టిన తొలి వారంలోనే F1(RD)/Lasota టీకా మందు కంటిలో/ముక్కులో వేస్తే 6 వారాల వరకు ఈ కొక్కెర వ్యాధి రాదు. కోళ్లకు ఆరు వారాల వయసులో R2B (R.D.) వ్యాక్సిన్ 0.5 ml s/c వేయాలి.

News December 6, 2025

మాయిశ్చరైజర్‌ వాడితే చర్మం జిడ్డుగా మారుతోందా?

image

చలికాలంలో చర్మ ఆరోగ్యం కోసం మాయిశ్చరైజర్ వాడటం తప్పనిసరి. అయితే కొందరిలో దీనివల్ల చర్మం జిడ్డుగా మారి, మొటిమలు కూడా వస్తుంటాయి. ఇలాంటప్పుడు జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్, వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని వాడటం వల్ల చర్మంలోకి మాయిశ్చరైజర్ ఇంకి పొడిబారిపోకుండా సంరక్షిస్తుందంటున్నారు. అయినా సమస్య తగ్గకపోతే డెర్మటాలజిస్టును కలవడం మంచిదని సూచిస్తున్నారు.