News November 20, 2024

వజ్రాలను వెతుక్కొని ఇంటికి తీసుకెళ్లొచ్చు!

image

అమెరికాలోని ఆర్కాన్సాస్‌లో ఉన్న ‘డైమండ్స్ స్టేట్ పార్క్’లో పర్యాటకులు వజ్రాలను వెతుక్కోవచ్చు. ముప్పైఏడున్నర ఎకరాల డైమండ్ ల్యాండ్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ పార్క్స్ అండ్ టూరిజం 1972లో కొనుగోలు చేసింది. అప్పటి నుంచి టూరిస్టులు ఇక్కడకు వచ్చి వారు కనుగొన్న వజ్రాలను తీసుకెళ్తున్నారు. ఏటా 600కు పైగా అన్‌కట్ డైమండ్స్ ఇక్కడ లభిస్తున్నాయి. 40 క్యారెట్ల కంటే ఎక్కువగా ఉన్న వజ్రం ఇక్కడ దొరికినదాంట్లో అతిపెద్దది.

Similar News

News November 16, 2025

రాజస్థాన్ చీఫ్ సెక్రటరీగా తెలుగు వ్యక్తి

image

రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలుగు IAS ఆఫీసర్ వోరుగంటి శ్రీనివాస్ నియమితులయ్యారు. కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్న ఈయనను RJ ప్రభుత్వం డిప్యుటేషన్‌పై రప్పించి సీఎస్ బాధ్యతలు అప్పగించింది. ఈయన 1966లో అరకు లోయలో జన్మించారు. భద్రాచలం, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు. 1989లో ఎంటెక్ పూర్తయ్యాక IASకు ఎంపికయ్యారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవరాలిని శ్రీనివాస్ వివాహం చేసుకున్నారు.

News November 16, 2025

వేరుశనగ పంట కోత.. ఇలా చేస్తే మేలు

image

వేరుశనగ పంటలో 75 నుంచి 80 శాతం కాయలు పూర్తిగా పక్వానికి వచ్చినప్పుడు మాత్రమే పంటను కోయాలి. పంటకోత కొరకు డిగ్గర్ యంత్రాన్ని, మొక్క నుంచి కాయలను వేరుచేయటానికి త్రైషర్ యంత్రాన్ని ఉపయోగిస్తే మంచిది. త్రైషర్ ద్వారా ఒక గంటకు 2 నుంచి 2 1/2 క్వింటాళ్ల కాయలను మొక్కల నుంచి వేరుచేయవచ్చు. ఇలా కూలీల కొరతను అధిగమించవచ్చు. కోత తర్వాత కాయలను బాగా ఆరబెట్టాలి. కాయల్లో తేమ ఎక్కువ లేకుండా చూసుకోవాలి.

News November 16, 2025

శబరిమలకు వెళ్లే భక్తులకు అలర్ట్

image

శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు నదీస్నానం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అక్కడి ఆరోగ్యశాఖ సూచించింది. రాష్ట్రంలో అమీబిక్ మెనింజోఎన్‌సైఫలిటిస్ (బ్రెయిన్ ఫీవర్) కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నదీస్నానాలు చేసే సమయంలో ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని పేర్కొంది. వేడి చేసిన నీటినే తాగాలని, తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని తెలిపింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్ లైన్ నంబర్ 04735 203232.