News January 20, 2025

సిగ్నల్ లేకపోయినా కాల్ మాట్లాడొచ్చు!

image

కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇంటర్-సర్కిల్ రోమింగ్‌ను ప్రారంభించింది. దీనిద్వారా జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు సిగ్నలింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 4G నెట్‌వర్క్ అందిస్తుంది. యూజర్ వాడే సిమ్‌లో నెట్‌వర్క్ లేకపోయినా అందుబాటులో ఉన్న ఏ నెట్‌వర్క్‌నైనా ఉపయోగించి కాల్స్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం టెలికం యూజర్లకు ఎంతో ఉపయోగపడనుంది.

Similar News

News December 22, 2025

సొంత పార్టీ నేతలను తొక్కుకుంటూ పోయిన చరిత్ర నీది: హరీశ్

image

TG: ఫోర్త్ సిటీ ఎందుకన్న <<18633868>>కేసీఆర్<<>> ప్రశ్నకు రేవంత్ ఎందుకు సమాధానమివ్వలేదని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ప్రశ్నించారు. ‘నిన్న చిట్ చాట్‌లో రేవంత్ అన్ని అబద్ధాలు చెప్పారు. BRS పాలనను అనేకమంది ప్రశంసించారు. సొంత పార్టీ నేతలను తొక్కుకుంటూ పోయిన చరిత్ర నీది రేవంత్. నీకు నీతి ఎక్కడుంది? రేపు ఎక్కడ ఉంటావో నీకే తెలియదు. చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తావు’ అని ఫైరయ్యారు.

News December 22, 2025

PCOSని ఎలా కంట్రోల్ చెయ్యాలంటే?

image

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఇటీవల మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది. వయసు, బరువుతో సంబంధం లేకుండా ఎవరైనా దీని బారిన పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీన్ని అదుపులో ఉంచుకోవాలంటే సరైన బరువును మెయింటైన్ చేయడం, మైండ్ ఫుల్ ఈటింగ్, క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం, వైద్య పరీక్షలు చేయించుకోవడం, అవసరమైన మందులు వాడటం, నిద్రలేమి, దీర్ఘకాలిక ఒత్తిడి తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.

News December 22, 2025

శబరిమల భక్తులకు ‘కేరళ సద్య’

image

శబరిమలలో అయ్యప్ప భక్తులకు సంప్రదాయ కేరళ సద్య(విశేష విందు) పంపిణీ ప్రారంభమైంది. దేవస్వం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దీపప్రజ్వలన చేసి స్వామికి నివేదించారు. అనంతరం భక్తులకు వడ్డించారు. ఇందులో రైస్, పప్పు, సాంబార్, రసం, రెండు రకాలు కేరళ స్టైల్ కర్రీస్, పచ్చడి, అప్పడం, పాయసం వంటి వంటకాలు ఉంటాయి. రోజుకు 5,000 మందికిపైగా భక్తులకు రోజు విడిచి రోజు సద్య, మధ్యలో పులావ్‌ను భక్తులకు వడ్డించనున్నారు.