News August 18, 2024

ఫోన్‌పే, గూగుల్‌పేలో కరెంట్ బిల్లులు కట్టొచ్చు

image

TG: ఫోన్‌పే, గూగుల్‌పేలో కరెంట్ బిల్లులు చెల్లించవచ్చని TGNPDCL వెల్లడించింది. మొన్న TGSPDCL పరిధిలో ఈ సౌకర్యం రాగా.. తాజాగా NPDCL పరిధిలోనూ అందుబాటులోకి వచ్చింది. భారత్ బిల్‌పేలో చేరకపోవడంతో RBI ఆదేశాలతో ఈ సంస్థలు ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించడాన్ని జులై 1న నిలిపివేశాయి. తాజాగా భారత్ బిల్‌పేలో చేరడంతో గతంలో మాదిరిగానే విద్యుత్ బిల్లులు UPI యాప్‌లలో నేరుగా చెల్లించవచ్చు.

Similar News

News December 3, 2025

ఓపెన్ కాని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్‌‌

image

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్‌‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఓపెన్ చేస్తే గేమింగ్ సైట్‌కు రీడైరెక్ట్ అవుతోందని అధికారులు వెల్లడించారు. సమస్యపై ఐటీ నిపుణులు పని చేస్తున్నారు. పూర్తిస్థాయి పునరుద్ధరణకు వారం రోజులు పట్టే అవకాశం ఉందని సైబర్ క్రైం డీసీపీ సుధీంద్ర తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News December 3, 2025

నాది కథను మలుపు తిప్పే రోల్: సంయుక్త

image

‘అఖండ-2’ అభిమానుల అంచనాలకు మించి ఉండబోతుందని హీరోయిన్ సంయుక్త మేనన్ అన్నారు. చిత్రంలో తన పాత్ర చాలా స్టైలిష్‌గా ఉంటుందని, కథను మలుపు తిప్పే రోల్ అని చెప్పారు. ఈ సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు షెడ్యూల్ బిజీగా ఉన్నా డేట్స్ అడ్జస్ట్ చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం స్వయంభు, నారీ నారీ నడుమ మురారి చిత్రాల్లో నటిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా అఖండ-2 ఎల్లుండి థియేటర్లలో రిలీజ్ కానుంది.

News December 3, 2025

బంధం బలంగా ఉండాలంటే ఆర్థిక భద్రత ఉండాల్సిందే!

image

మానవ సంబంధాల బలోపేతానికి ఆర్థిక సంబంధాలు కీ రోల్ పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. జీవితంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు, భావోద్వేగ మద్దతు, సామరస్యం చాలా ముఖ్యమని, కానీ వీటికి తోడు ఆర్థిక భద్రత ఉన్నప్పుడే అవి మరింత పటిష్టంగా ఉంటాయని సైకాలజీ టుడే, యూగోవ్ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది. ఆర్థిక భద్రత లేదా స్థిరత్వం లేకపోతే చాలా వరకు సంబంధాలు విచ్ఛిన్నం అయ్యే అవకాశం ఉంటుందని వెల్లడించింది.