News August 21, 2025
రూ.799 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు: జియో

ప్రీపెయిడ్ ప్లాన్ రూ.799ను తొలగించారనే ప్రచారాన్ని జియో ఖండించింది. యూజర్లు ఈ ప్లాన్‌ను వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఫోన్ పే, గూగుల్ పేతో పాటు ఇతర పేమెంట్ ప్లాట్ ఫామ్‌ల ద్వారా ఈ రీఛార్జ్ చేసుకోవచ్చని పేర్కొంది. యూజర్ల అవసరాలకు తగ్గట్లుగా ప్లాన్లను అందించేందుకు కట్టుబడి ఉంటామని తెలిపింది. కాగా ఈ ప్లాన్‌లో అపరిమిత కాల్స్, రోజుకు 1.5 జీబీ డేటాను 84 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది.
Similar News
News April 2, 2026
రూ.1,000కోట్లు ఇచ్చేదాకా వైద్యం బంద్: ఆషా

NTR వైద్య సేవ నెట్‌వర్క్ ఆస్పత్రుల బంద్ కొనసాగనుంది. నిన్న ప్రభుత్వం, AP స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఆషా) మధ్య చర్చలు జరిగాయి. రూ.3వేల కోట్లు ఇవ్వాలని ఆషా డిమాండ్ చేయగా, బకాయిలు రూ.2,100కోట్లే ఉన్నాయని ఆరోగ్యశాఖ సెక్రటరీ సౌరభ్ గౌర్ తెలిపారు. 2 వారాల్లో రూ.1,000కోట్లు, ప్రతినెలా రూ.250కోట్లు విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కాగా రూ.1,000కోట్లు ఇచ్చే వరకు బంద్ కొనసాగుతుందని ఆషా తెలిపింది.
News April 2, 2026
బరువు తగ్గాలా? సమ్మర్ బెస్ట్..!

వెయిట్ లాస్ కావడానికి వేసవి మంచి సీజన్. చలి, వర్షాకాలంతో పోలిస్తే ఈ సీజన్‌లో ఉదయం త్వరగా నిద్ర లేవచ్చు. వాకింగ్, రన్నింగ్‌కు వెళ్తే చెమట ద్వారా ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. స్విమ్మింగ్ కూడా మంచి ఎక్సర్‌సైజ్. వేడి వాతావరణం, వాటర్ ఎక్కువ తాగడం వల్ల ఆకలి వేయదు. ఇది ఒకరకంగా బరువు పెరగకపోవడానికి దోహదపడుతుంది. ఈ సీజన్‌లో లభించే పుచ్చ, నారింజ, దోస, కొబ్బరినీళ్లు తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది.
News April 2, 2026
రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన!

AP: రాష్ట్రంలోని గ్రామాల్లో సర్పంచ్‌ల పదవీకాలం నేటితో ముగియనుంది. దీంతో రేపటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన అమల్లోకి రానుంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం 20రోజుల కిందటే ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పదవీ కాలం మొన్నటితో ముగిసింది. దీంతో కొత్త SEC వచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశముంది.


