News September 23, 2025
ముఖం చూసి ఆర్థిక స్థితిని చెప్పొచ్చు!

ఒకరి ముఖాన్ని చూసి వారు సంతోషంగా ఉన్నారా? బాధలో ఉన్నారో చెప్పగలం. అయితే వారి సామాజిక ఆర్థిక స్థితిని కూడా మెదడు అంచనా వేయగలదని టొరంటో యూనివర్సిటీ పరిశోధనలో తెలిసింది. ముఖ కవళికలు, కళ్ల చుట్టూ ఉన్న గీతలు, చర్మంలోని మార్పుల ఆధారంగా అంచనా వేస్తుందట. తరచూ ఒత్తిడి, పోషకాహార లోపం, నిద్రలేమి వంటివి ముఖంపై ప్రభావం చూపుతాయి. వీటిని బట్టి వ్యక్తి ఆర్థిక పరిస్థితి గురించి మెదడు ఓ అవగాహనకు వస్తుంది.
Similar News
News September 23, 2025
మైథాలజీ క్విజ్ – 14

1. రామాయణంలో ‘వాలి’ కుమారుడు ఎవరు?
2. వ్యాసుని ద్వారా దాసి కన్న బిడ్డ ఎవరు?
3. అత్రి మహాముని భార్య ఎవరు?
4. కామాఖ్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది?
5. శ్రీరామనవమి ఏ తెలుగు మాసంలో వస్తుంది?
– సమాధానాలు సాయంత్రం 6 గంటలకు
<<-se>>#mythologyquiz<<>>
News September 23, 2025
మండలి నుంచి వైసీపీ వాకౌట్

ఏపీ శాసన మండలి నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. అట్రాసిటీ కేసులపై చర్చ సందర్భంగా ‘మాపై గొడ్డలి వేటు, కోడికత్తి, అమ్మా, చెల్లి కేసులు లేవు’ అని హోం మంత్రి అనిత YCPపై సెటైర్లు వేశారు. దీంతో ఆమె వ్యాఖ్యలకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామంటూ YCP ఎమ్మెల్సీలు బయటికి వెళ్లిపోయారు.
News September 23, 2025
సన్నబియ్యం పంపిణీకి ప్రత్యేక సంచులు

TG: రేషన్ కార్డు ద్వారా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక సంచులను తయారు చేయించింది. ‘రేషన్ కార్డుపై అందరికీ సన్నబియ్యం.. ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం’ అనే కొటేషన్‌ను ముద్రించింది. CM రేవంత్, Dy.CM భట్టి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ ఫొటోలతో వీటిని రూపొందించింది. ఈ బ్యాగుల్లోనే బియ్యాన్ని రేషన్ షాపులకు సరఫరా చేయనుంది. ఇప్పటివరకు వస్తున్న గోనె సంచులు ప్రస్తుతానికి ఆగిపోనున్నాయి.