News November 22, 2024

చెట్లు నరికేయకుండా కర్ర వాడుకోవచ్చు!

image

పచ్చదనాన్ని పరిరక్షించేందుకు జపాన్ ప్రభుత్వం పాటిస్తోన్న పద్ధతిని నెటిజన్లు అభినందిస్తున్నారు. అక్కడ చెట్లను నరకకుండానే కలపను పొందుతుంటారు. అది ఎలా అనుకుంటున్నారా? దైసుగి అనే పురాతన ప్రక్రియలో ఉత్తమమైన దేవదారు వృక్షాలను ఎంపిక చేస్తారు. పొడవుగా పెరిగేందుకు పైన కొమ్మలను కట్ చేస్తుంటారు. ఏపుగా పెరిగిన వృక్షాలను పైనుంచి కత్తిరించి చెక్కను వాడుకుంటారు.

Similar News

News December 12, 2025

HEADLINES

image

* తెలంగాణలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికలు
* హోరాహోరీగా సాగిన ఓట్ల లెక్కింపు.. కొన్ని గ్రామాల్లో ఇంకా కొనసాగుతున్న కౌంటింగ్
* రైతుల కోసం అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బ్యాంక్: CM CBN
* ట్రంప్‌కు PM మోదీ ఫోన్.. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు
* పనితీరు మారాలంటూ TBJP ఎంపీలకు PM మోదీ హితబోధ
* సౌతాఫ్రికాతో రెండో టీ20లో భారత్ ఓటమి

News December 12, 2025

సౌండ్ బాక్సులు బద్దలయ్యే విజయ నినాదం: లోకేశ్

image

‘అఖండ-2’లో బాలా మామయ్య నట తాండవం ప్రేక్షకులను కనువిందు చేయనుందని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘God of Masses మూవీ అంటే సౌండ్ బాక్సులు బద్దలయ్యే విజయ నినాదం. ఈ మూవీ అఖండ విజయం సాధించాలని కోరుకుంటున్నా. 5 దశాబ్దాల సినీ చరిత్రలో మరో ఘనవిజయం సొంతం చేసుకోబోతున్న మామయ్యకు అభినందనలు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. అఖండ-2 రేపు విడుదల కానుండగా, ఇప్పటికే ప్రీమియర్స్ మొదలయ్యాయి.

News December 12, 2025

భారీ మెజార్టీతో BRS బలపరిచిన అభ్యర్థి గెలుపు

image

TG: ములుగు(D) ఏటూరు నాగారం సర్పంచ్‌గా BRS బలపరిచిన కాకులమర్రి శ్రీలత గెలుపొందారు. ప్రత్యర్థి గుడ్ల శ్రీలతపై 3వేల పైచిలుకు ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ మొత్తం ఓట్లు 8,333 పోలయ్యాయి. BRS బలపరిచిన అభ్యర్థికి 5,520, కాంగ్రెస్ సపోర్ట్ చేసిన అభ్యర్థికి 2,330 ఓట్లు వచ్చాయి. మంత్రి సీతక్క ఇక్కడ 5 సార్లు ప్రచారం చేసినా కాంగ్రెస్ గెలవలేకపోయిందని BRS నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.