News May 12, 2024

ఓటరు కార్డు లేకున్నా ఓటు వేయవచ్చు

image

AP: మే 13న జరిగే ఎన్నికల్లో ఓటరు ఐడీ లేకున్నా ఓటు వేయవచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా ఆధార్, కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్‌పోర్టు, MGNREGA జాబ్ కార్డు, పెన్షన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే జాబ్ కార్డులు, UDID కార్డు, MP/MLA/MLCలకు ఇచ్చే కార్డులు, RGI స్మార్ట్ కార్డు చూపించి ఓటు వేయవచ్చు. ఓటర్ స్లిప్ మాత్రం పక్కా.

Similar News

News January 1, 2025

ఉగాదే మన కొత్త సంవత్సరం: రాజాసింగ్

image

TG: తెలుగువారికి కొత్త సంవత్సరం ఉగాదేనని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం పేరిట విదేశీ సంస్కృతిని భవిష్యత్ తరాలకు నేటి తరం అలవాటు చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఆంగ్లేయులు జనవరి 1ని మనపై రుద్ది వెళ్లారు. ఆ వలస సంస్కృతిని వదిలేద్దాం. ప్రభుత్వాలు, మేధావులు ఉగాదిని కొత్త సంవత్సరంగా అలవాటు చేయాలి. క్లబ్బులు, పబ్బులు భారత సంస్కృతి కాదు’ అని పేర్కొన్నారు.

News January 1, 2025

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షం

image

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌, సుమీ ప్రాంతాలపై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. 21 మిస్సైల్స్‌ను మాస్కో ప్రయోగించగా ఆరింటిని తాము నేలకూల్చినట్లు ఉక్రెయిన్ తెలిపింది. దాడిలో ప్రాణనష్టం సంభవించలేదని, ఒకరు గాయపడ్డారని వెల్లడించింది. ఆస్తినష్టం వాటిల్లిందని స్పష్టం చేసింది. ఇక మరో 40 డ్రోన్లతోనూ మాస్కో దాడి చేసిందని, వాటిలో 16 డ్రోన్లను నేలకూల్చామని, 24 డ్రోన్లు తమ వరకూ రాలేకపోయాయని పేర్కొంది.

News January 1, 2025

2025 సాఫీగా సాగేందుకు ఈ మూడూ కీలకం

image

కొత్త ఏడాది వచ్చేసింది. గడచిన కాలం ఎన్నోకొన్ని పాఠాలను మనకు నేర్పింది. వాటి నుంచి నేర్చుకుని ముందుకు సాగితే కొత్త ఏడాది సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా సారీ, థాంక్స్, ప్లీజ్ అనే మూడు పదాలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని వ్యక్తిత్వ నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా అడిగే సమయంలో ఒక ప్లీజ్, తప్పు జరిగినప్పుడు ఒక సారీ, సాయం పొందినప్పుడు ఒక థాంక్స్.. ఈ మూడూ మనిషి గౌరవాన్ని పెంచుతాయని వారు చెబుతున్నారు.