News May 8, 2024

FREEగా టీ20 వరల్డ్ కప్ చూడొచ్చు

image

క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్‌ను డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఉచితంగా ప్రసారం చేయనుంది. ఇండియాలోని యూజర్లు మొబైల్‌ వెర్షన్‌లో దీన్ని ఉచితంగా ఆస్వాదించవచ్చు. గత వన్డే వరల్డ్ కప్‌తో పాటు ఆసియా కప్‌ను సైతం ఉచితంగా ప్రసారం చేయగా.. రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి.

Similar News

News February 5, 2026

తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా పడిపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.5,020 తగ్గి రూ.1,54,420కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.4,600 పడిపోయి రూ.1,41,550 పలుకుతోంది.

News February 5, 2026

హిందీ మాత్రమే నేర్చుకుంటే పానీపూరీ అమ్ముకోవాల్సిందే: మంత్రి

image

హిందీ వివాదం వేళ తమిళనాడు మంత్రి MRK పన్నీర్‌సెల్వం షాకింగ్ కామెంట్లు చేశారు. ఉత్తరాది ప్రజలు కేవలం హిందీ నేర్చుకోవడం వల్ల వారు తమిళనాడులో పానీపూరీ సెల్లర్లు, నిర్మాణ కార్మికులు, టేబుల్ క్లీన్ చేసేవారిగా స్థిరపడుతున్నారని ఎద్దేవా చేశారు. తమిళియన్లు మాతృభాషతోపాటు ఇంగ్లిష్ నేర్చుకుని US, UKలో ఉద్యోగాలు సాధించి రూ.కోట్లు సంపాదిస్తున్నారని పేర్కొన్నారు.

News February 5, 2026

శంషాబాద్ కేంద్రంగా 3 బుల్లెట్ రైలు కారిడార్లు: కిషన్ రెడ్డి

image

HYD హైస్పీడ్ రైల్ హబ్‌గా మారబోతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ‘TGలో రైల్వే మౌలిక సదుపాయాలకు బడ్జెట్‌లో ₹5,454Cr కేటాయించాం. శంషాబాద్ కేంద్రంగా 3 బుల్లెట్ రైలు కారిడార్లు ప్రారంభం కానున్నాయి. వీటి ద్వారా HYD-BLR, CHE-PUNE జర్నీకి 3hrs కంటే తక్కువ సమయం పట్టనుంది. రాష్ట్రంలో ఇప్పటికే ₹47,984Cr విలువైన ప్రాజెక్టులు కొనసాగుతుండగా, 100% రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తయింది’ అని పేర్కొన్నారు.