News March 20, 2025
నన్ను కలిసేందుకు డబ్బులు అవసరం లేదు: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి లండన్ టూర్‌ను కొందరు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్యాన్ మీట్ పేరుతో చిరును కలిసే అవకాశం కల్పిస్తామంటూ కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిపై చిరు Xలో స్పందించారు. ‘ఫ్యాన్ మీటింగ్ పేరుతో ఇలా డబ్బులు వసూలు చేయడాన్ని నేను ఏమాత్రం ఒప్పుకోను. వారి డబ్బులు వెనక్కి ఇచ్చేయండి. నన్ను కలవడానికి ఎవరికీ డబ్బులు చెల్లించనక్కర్లేదు’ అని ఫ్యాన్స్‌కు సూచించారు.
Similar News
News September 17, 2025
మరో 3 గంటలు భారీ వర్షం.. జాగ్రత్త!

TG: హైదరాబాద్‌లో <<17744168>>వర్షం<<>> దంచికొడుతోంది. మరో 3 గంటలు వాన కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అటు రాబోయే 2-3 గంటల్లో ఉమ్మడి కరీంనగర్, మంచిర్యాల, యాదాద్రి, NZB, సూర్యాపేట, HNK, మేడ్చల్, ఉమ్మడి మెదక్ తదితర జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
News September 17, 2025
BC రిజర్వేషన్లను పెంచేందుకు చర్యలు: మంత్రివర్గ ఉపసంఘం

AP: స్థానిక సంస్థల ఎన్నికల్లోగా BC రిజర్వేషన్లను 34 శాతానికి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు సవిత, కొల్లు రవీంద్ర తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం భేటీలో BC రిజర్వేషన్లపై చర్చించామన్నారు. రిజర్వేషన్లను CBN 34%కి పెంచితే, జగన్ 24%కి తగ్గించారని పేర్కొన్నారు. న్యాయపరిశీలన చేసి రిజర్వేషన్లపై పకడ్బందీ చట్టం తెస్తామన్నారు. త్వరలో BC రక్షణ చట్టానికి తుది రూపం తీసుకురానున్నట్లు చెప్పారు.
News September 17, 2025
కేరళలో PAM కలకలం.. 19 మంది మృతి

కేరళలో ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్(PAM) అనే ప్రాణాంతక వ్యాధి కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 61 కేసులు, 19 మరణాలు సంభవించాయి. క్లోరినేషన్ సరిగా లేని నీటిలో ఉండే నేగ్లేరియా ఫౌలెరీ(మెదడును తినే) అమీబా వల్ల ఇది వ్యాపిస్తుంది. ఈత/స్నానం సమయంలో నీటి ద్వారా మనుషుల శరీరంలోకి ప్రవేశించి నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఈ వ్యాధి సోకితే తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.