News April 8, 2025

వీరుడిలా పోరాడావు.. హార్దిక్ ఇన్‌స్టా పోస్ట్

image

LSGతో మ్యాచులో తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరగగా దీనికి కారణం MI కెప్టెన్ హార్దిక్ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. నిన్న RCBతో మ్యాచులో వీరిద్దరూ పోరాడినా, కీలక సమయంలో ఔటవ్వడంతో ఓటమి తప్పలేదు. అయితే తిలక్‌తో తనకు ఎలాంటి మనస్పర్ధలు లేవని అర్థం వచ్చేలా పాండ్య IGలో పోస్ట్ చేశారు. వీరుడిలా పోరాడావంటూ తిలక్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఇలా ప్లేయర్లను ప్రోత్సహించాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Similar News

News December 4, 2025

నాణ్యమైన పనులు చేపట్టాలి: కలెక్టర్

image

పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్‌లో ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల ZP నిధులు మంజూరయ్యాయన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

News December 4, 2025

BREAKING: సెలవుల జాబితా ప్రకటించిన ప్రభుత్వం

image

AP: 2026కు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల జాబితాను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 24 జనరల్ హాలిడేస్, 21 ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి. జనరల్ సెలవుల్లో మహాశివరాత్రి(ఫిబ్రవరి 15), బాబు జగ్జీవన్ రామ్ జయంతి(ఏప్రిల్ 5), దుర్గాష్టమి(అక్టోబర్ 18), దీపావళి(నవంబర్ 8) ఆదివారం వచ్చాయి. పైన ఫొటోల్లో సెలవుల లిస్టును చూడొచ్చు. వీటిని బట్టి మీ ట్రిప్స్‌ను ప్లాన్ చేసుకోండి.

News December 4, 2025

సింగపూర్‌ లాంటి దేశాన్నీ ఇబ్బంది పెట్టారు: CM

image

AP: గత పాలకులు సింగపూర్‌ లాంటి దేశాన్ని, ఆ దేశ కంపెనీలను ఇబ్బంది పెట్టారని CM CBN విమర్శించారు. ‘ఆ బ్యాడ్ ఇమేజ్ చెరిపి బ్రాండ్ ఇమేజ్ తేవడంతో ఇపుడు పెట్టుబడులు వస్తున్నాయి. ఇటీవలి MOUలన్నీ 45 రోజుల్లో గ్రౌండ్ కావాలి. భూ సేకరణలో వివాదాలు రాకూడదు. భూములిచ్చిన వాళ్లు, తీసుకున్న వాళ్లు సంతోషంగా ఉండాలి’ అని అధికారులకు సూచించారు. UAE మాదిరి APలో ₹500 కోట్లతో సావరిన్ ఫండ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.