News November 5, 2024
కొన్ని రోజులు ఢిల్లీలో ఉండండని మీరే అంటారు: ప్రియాంకా గాంధీ
వయనాడ్‌లో ప్రియాంకా గాంధీ గెలిస్తే తరువాత నియోజకవర్గంలో పెద్దగా కనిపించరని వస్తున్న విమర్శలను ఆమె కొట్టిపారేశారు. తన కుమారుడు బోర్డింగ్ స్కూల్లో చదువుతున్నప్పుడు అతణ్ని చూసేందుకు నిత్యం వెళ్లేదాన్నని, అయితే కొన్ని రోజులకు రావడం తగ్గించండని ప్రిన్సిపల్ కోరారని తెలిపారు. ఆ ప్రిన్సిపల్ మాదిరిగానే ఇక్కడికి రావడం తగ్గించి ఢిల్లీలో ఉండండని వయనాడ్ ప్రజలు చెప్పే రోజు వస్తుందన్నారు.
Similar News
News November 5, 2024
బిర్యానీ తిని యువతి మృతి
TG: కొన్ని రోజుల క్రితం HYDలో మోమోస్ తిని ఓ మహిళ మరణించిన ఘటన మరవకముందే మరో విషాదం జరిగింది. నిర్మల్ జిల్లాలో బిర్యానీ తిని ఫుడ్ పాయిజన్‌తో యువతి మరణించింది. ఈ నెల 2న బోథ్‌కు చెందిన 15-20 మంది నిర్మల్‌లోని గ్రిల్ నైన్ రెస్టారెంట్లో చికెన్ మండీ బిర్యానీ తిన్నారు. ఆ వెంటనే వాంతులు చేసుకోవడంతో ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఇవాళ పూల్ కలి బైగా(19) మృతి చెందింది.
News November 5, 2024
రెండేళ్ల బిడ్డ కోసం 43 ఏళ్లుగా వెతుకులాట!
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న రెండేళ్ల కూతురు కాట్రిస్ లీ 43 ఏళ్ల క్రితం జర్మనీలోని బ్రిటిష్ మిలిటరీ సూపర్ మార్కెట్లో తప్పిపోయింది. ఇప్పటికీ ఆమె జాడ కోసం తండ్రి ఆర్మీ వెటరన్ రిచర్డ్ వెతుకుతూనే ఉన్నారు. ప్రతి ఏటా కాట్రిస్ తప్పిపోయిన ప్రదేశానికి వెళ్లి వస్తుంటారు. పోలీసులు సైతం వారికి హెల్ప్ చేస్తున్నారు. రిచర్డ్‌కు 75 ఏళ్లు కాగా తాను చనిపోయేవరకూ బిడ్డ కోసం వెతకడం ఆపనని ఆయన చెబుతున్నారు.
News November 5, 2024
Stock Market: బుల్ జోరు కొనసాగింది
బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మెటల్ రంగ షేర్లకు మంగళవారం కొనుగోళ్ల మద్దతు లభించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకుపోయాయి. సెన్సెక్స్ 694 పాయింట్ల లాభంతో 79,476 వద్ద, నిఫ్టీ 217 పాయింట్ల లాభంతో 24,213 వద్ద స్థిరపడ్డాయి. 78,300 పరిధిలో సెన్సెక్స్‌కు, నిఫ్టీకి 23,850 పరిధిలో కీలక మద్దతు లభించింది. JSW Steel 4.5%, Tata Steel 3.7% లాభపడ్డాయి. Trent 1.7%, Adni Ports 1.5% మేర నష్టపోయాయి.