News January 11, 2025
రిగ్రెట్గా ఫీలవుతారు.. NRIలకు మోదీ వార్నింగ్!

NRIలు వెంటనే స్వదేశానికి తిరిగొచ్చేయాలని బహిరంగంగా పిలుపునిస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. ‘ప్రపంచం చాలా మారిపోతోంది. ఒకవేళ మీరు భారత్కు రాకపోతే రిగ్రెట్గా ఫీలవుతారు’ అని హెచ్చరించారు. ‘CMగా ఉన్న నాకు 2005లో US వీసా నిరాకరించింది. భారత వీసా కోసం ప్రపంచం క్యూలో నిలబడే రోజు వస్తుందని అప్పుడే చెప్పా. ఇప్పుడు భారత్కు ఆ టైమ్ వచ్చేసింది. గత 2 దశాబ్దాల్లో దేశం చాలా పురోగతి సాధించింది’ అని అన్నారు.
Similar News
News October 23, 2025
IAS రిజ్వీ VRS.. సంచలనంగా మంత్రి లేఖ!

TG: వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణ, ఆయనపై మంత్రి జూపల్లి CSకు లేఖ రాయడం సంచలనంగా మారింది. 1999 IAS బ్యాచ్కు చెందిన రిజ్వీ మరో పదేళ్ల సర్వీస్ ఉండగానే VRS తీసుకున్నారు. మద్యం బాటిళ్లపై వేసే హోలోగ్రామ్ లేబుల్స్కు కొత్త టెండర్లు పిలవాలని ఆదేశించినా రిజ్వీ పాతవారికే అవకాశం ఇచ్చారని మంత్రి లేఖలో పేర్కొన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
News October 23, 2025
రెడ్ అలర్ట్.. ఫ్లాష్ ఫ్లడ్స్కు అవకాశం

AP: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కోస్తాంధ్ర, యానాంతో పాటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ (ఆకస్మిక వరదలు) వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు ఈ నెల 25-28 మధ్యలో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉంది.
News October 23, 2025
తెలంగాణ రౌండప్

* రేపు ఫిరాయింపు MLAలను విచారించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్..
* రంగారెడ్డి, వికారాబాద్, HNK, మేడ్చల్లో డీఅడిక్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు..
* వచ్చే నెల 20 నుంచి రాష్ట్రంలో పులుల లెక్కింపు.. నేటి నుంచి జిల్లాకు ఇద్దరు అధికారుల చొప్పున శిక్షణ
* రంగారెడ్డిలోని కుర్మల్ గూడ, తొర్రూర్, మేడ్చల్లోని బహదూర్ పల్లి రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు ఈ నెల 28 నుంచి 30వరకు ఈ-వేలం