News April 20, 2025

క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. యువకుడి మృతి

image

TG: మేడ్చల్(D) రాంపల్లి దాయరలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతూ ప్రణీత్(32) గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. త్యాగి స్పోర్ట్స్ వెన్యూ గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడుతుండగా అతనికి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ప్రణీత్‌ను బోయినపల్లి వాసిగా గుర్తించారు.

Similar News

News January 22, 2026

30న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం

image

విశాఖ నగరపాలక సంస్థకు ఈ నెల 30న సాధారణ కౌన్సిల్ సమావేశం, ఫిబ్రవరి 4న 2026–27 వార్షిక బడ్జెట్‌కు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు మేయర్ పీలా శ్రీనివాసరావు గ్రేటర్ కమిషనర్ కేతన్ గార్గ్‌కు ప్రతిపాదనలు పంపారు. రూ.50 లక్షల పనుల అనుమతులపై ఈ నెల 27న స్థాయి సంఘం సమావేశం జరగనుంది. పాలకవర్గ పదవీకాలం మార్చి 18తో ముగియనుండగా, మార్చి 7 తర్వాత కౌన్సిల్ సమావేశాలకు నిబంధనల ప్రకారం అవకాశం లేదు.

News January 22, 2026

గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

image

గ్రీన్‌లాండ్‌ను ఎలాగైనా దక్కించుకుంటానన్న <<18921246>>ట్రంప్<<>> సడన్‌గా రూట్ మార్చారు. ఫోర్స్ వాడనని ప్రకటించారు. ఆయన వెనక్కి తగ్గడానికి మెయిన్ రీజన్స్ ఇవే అయి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 1.అమెరికా గ్లోబల్ ఇమేజ్ పాడవుతుందన్న భయం. 2.ప్రపంచ దేశాలన్నీ ఏకమై వ్యతిరేకించడం. 3.సైనిక దాడి చేస్తే NATO, UN రూల్స్ బ్రేక్ అవుతాయి. 4.మిత్రదేశాల మధ్య గ్యాప్ వచ్చే రిస్క్ ఉండటం. 5.USలోనే సపోర్ట్ లేకపోవడం.

News January 22, 2026

అభిషేక్ రికార్డు

image

టీమ్ ఇండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ సంచలనం సృష్టించారు. టీ20ల్లో అత్యంత వేగంగా 5వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా నిలిచారు. 2,898 బంతుల్లోనే ఈ మార్కు చేరుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో రసెల్(2,942), టిమ్ డేవిడ్(3,127), విల్ జాక్స్(3,196), గ్లెన్ మ్యాక్స్‌వెల్(3,239) ఉన్నారు. కేవలం అంతర్జాతీయ మ్యాచులే కాకుండా లీగ్స్, డొమెస్టిక్ మ్యాచులు ఇందులోకి వస్తాయి.