News July 18, 2024
రీల్స్ చేస్తూ లోయలో పడి యువతి మృతి

ముంబైకి చెందిన ట్రావెల్ ఇన్ఫ్లూయెన్సర్ అన్వీ కామ్దార్(26) స్నేహితులతో రాయ్గడలోని కుంభే జలపాతానికి వెళ్లారు. అక్కడ రీల్స్ చేసేందుకు లోయ అంచున నిలబడగా కాలు జారి 300 అడుగుల లోయలో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసు, ఫైర్ సిబ్బంది 6 గంటలు కష్టపడి అన్వీని కాపాడారు. కానీ తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్చిన కాసేపటికే ఆమె మరణించారు. అన్వీకి సోషల్ మీడియాలో 2లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
Similar News
News October 23, 2025
బాలింతలు ఏం తినాలంటే?

ఒక మహిళ జీవితంలో ఎక్కువ కెలోరీలు అవసరమయ్యేది బాలింత దశలోనే. బిడ్డకు పాలివ్వడం వల్ల ఆకలి ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ సమయంలో సమతులాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా టిఫిన్, లంచ్, డిన్నర్ మధ్యలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఫ్రూట్స్, నట్స్ తీసుకోవాలి. మిల్లెట్స్ జావలు, సూప్స్, చికెన్, చేపలు ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వులు, చక్కెర, ఉప్పులున్న ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి.
News October 23, 2025
ఏపీలో హైస్పీడ్ రైళ్లు రయ్…రయ్…

AP: రానున్న రోజుల్లో రాష్ట్రంలో హైస్పీడ్ రైళ్లు పరుగెత్తనున్నాయి. కేంద్రం చేపట్టే 2 హైస్పీడ్ రైల్ కారిడార్లు AP మీదుగా వెళ్లనున్నాయి. HYD-చెన్నై కారిడార్ పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 263 KM మేర వెళ్లనుంది. HYD-బెంగళూరు కారిడార్ కర్నూలు, నంద్యాల, ATP, సత్యసాయి జిల్లాల్లో 504 KM మేర వెళ్తుంది. ఈ రూట్లలో 15 స్టేషన్లు ఏర్పాటుకానుండడంతో జర్నీటైమ్ తగ్గనుంది.
News October 23, 2025
సోయా పంట కొనుగోలు ఎప్పుడు?

TG: ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 62,500 ఎకరాల్లో సోయా పంటను రైతులు సాగు చేశారు. చాలా ప్రాంతాల్లో పంట చేతికొచ్చి 15 రోజులు దాటింది. ఏటా మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. పంట సేకరిస్తుండగా ఈ ఏడాది ఇంకా ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. సోయాకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.5,328గా ఉంది. వర్షాలతో కొంత పంట నష్టపోయామని, మిగిలిన పంటనైనా ప్రభుత్వం త్వరగా కొనాలని రైతులు కోరుతున్నారు.