News April 25, 2024
ప్రియుడి కోసం యువతి వింత ప్రవర్తన.. వైద్యులు ఏం చెప్పారంటే?

కొంతమంది తమ ప్రియుడు/ప్రియురాలికి పదే పదే కాల్స్ చేసి విసిగిస్తుంటారు. చైనాకు చెందిన ఓ 18ఏళ్ల యువతి ఇటీవల తన ప్రియుడికి 100సార్లు కాల్ చేసింది. అతడు లిఫ్ట్ చేయకపోవడంతో వింతగా ప్రవర్తించింది. ఆమె బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు తేల్చారు. చిన్ననాటి నుంచి పేరెంట్స్‌తో సరైన అనుబంధం లేకపోవడమే దీనికి కారణమని, ఎమోషనల్ మేనేజ్మెంట్ టెక్నిక్‌తో సమస్యను పోగొట్టవచ్చని తెలిపారు.
Similar News
News November 21, 2025
RRB-NTPC ఫలితాలు విడుదల

RRB-NPTC 3,445 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి సీబీటీ 1 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టినతేదీ ఎంటర్ చేసి https://indianrailways.gov.in/లో ఫలితాలు తెలుసుకోవచ్చు. మొత్తం 27.55లక్షల మంది పరీక్ష రాయగా.. 51,979మంది సీబీటీ 2కు అర్హత సాధించారు.
News November 21, 2025
ఢిల్లీ హైకోర్టులో గౌతమ్ గంభీర్‌కు ఊరట

భారత్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో లైసెన్స్ లేకుండా కొవిడ్-19 మందులు నిల్వ చేసి, పంపిణీ చేశారని గంభీర్, కుటుంబ సభ్యులు, ఛారిటబుల్ ఫౌండేషన్‌పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటిని కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ తీర్పు చెప్పారు. ఫిర్యాదును కొట్టివేస్తున్నట్టు వెల్లడించారు. పూర్తి తీర్పు రావాల్సి ఉంది.
News November 21, 2025
ఆముదంతో ఎన్నో లాభాలు

చాలామంది ఇళ్లల్లో లభించే ఆముదం నూనెలో ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, యాంటి ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకు, చర్మానికి కూడా మేలు చేస్తాయి. ఇది వాడటం వల్ల జుట్టుకు అవసరమైన పూర్తి పోషణ అందుతుంది. జుట్టు రాలడం, చిట్లి పోవడం తగ్గి, కుదుళ్లు బలపడతాయి. ఎక్కువ జిడ్డుగా ఉంటుందని చాలామంది దీన్ని వాడటం మానేస్తారు. కానీ జుట్టు పెరగాలని కోరుకునేవారు ఆముదం నూనె ఎంచుకోవచ్చు.


