News March 20, 2024
క్యాంపస్ సెలక్షన్లలో యువతుల జోరు!

క్యాంపస్ సెలక్షన్లలో గత ఏడాది వనితల హవా సాగినట్లు హైర్‌ప్రో సంస్థ వెల్లడించింది. సెలక్ట్ అయిన ప్రతీ ముగ్గురు అభ్యర్థుల్లో ఒక అమ్మాయి ఉందని తెలిపింది. 2023లో సంస్థలు ఎంపిక చేసిన ఫ్రెషర్లలో 40% మంది యువతులే ఉన్నట్లు పేర్కొంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 5% ఎక్కువ. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, రీసెర్చ్ & డెవలప్మెంట్ రంగాలకు సంబంధించిన నియామకాల్లో ఎక్కువ మంది మహిళలు పాల్గొన్నట్లు తెలిపింది.
Similar News
News September 8, 2025
రష్యాపై మరిన్ని సుంకాలు: ట్రంప్

రష్యాపై మరిన్ని సుంకాలు విధిస్తామని US అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ‘రష్యాపై సెకండ్ ఫేస్ టారిఫ్స్‌కు సిద్ధంగా ఉన్నారా?’ అని రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘నేను రేడీగా ఉన్నాను’ అని ఆయన సమాధానమిచ్చారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలపై కూడా అదనపు సుంకాలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, చైనా వంటి దేశాలపై మరిన్ని సుంకాలు విధించాలని US ట్రెజరీ సెక్రటరీ<<17644290>> బెసెంట్<<>> కూడా అన్నారు.
News September 8, 2025
జ్వరమని వెళ్తే.. మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి!

TG: కరీంనగర్‌లో దారుణం వెలుగు చూసింది. జగిత్యాల జిల్లాకు చెందిన యువతి జ్వరమొచ్చిందని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు సమాచారం. ఆస్పత్రిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఆమె నిద్రపోతున్నప్పుడు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
News September 8, 2025
శరవేగంగా ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు

AP: గన్నవరం ఎయిర్‌పోర్ట్ ఇంటిగ్రేటేడ్ టెర్మినల్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ 6 ఎయిరో బ్రిడ్జిలు, ILBHS(inline Bagage handling system), ఎలివేటెడ్ ఫ్లైఓవర్ ప్రత్యేకంగా నిలవనున్నాయి. అరైవల్, డిపార్చర్ ప్యాసింజర్ల కోసం వేర్వేరుగా ఎయిరోబ్రిడ్జిలను అందుబాటులోకి తెస్తున్నారు. ILBHS వల్ల లగేజ్ వెంటనే స్కాన్ చేసుకోవచ్చు. నూతన టెర్మినల్ పనులు 70% పూర్తి కాగా, సంక్రాంతి నాటికి ప్రారంభించే అవకాశం ఉంది.