News April 3, 2024
LS ఎన్నికల్లో యంగెస్ట్ కంటెస్టెంట్

2024లోక్‌సభ ఎన్నికల్లో 25ఏళ్ల శాంభవీ చౌదరి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి పిన్న వయస్కురాలిగా ఆమె నిలవనున్నారు. బిహార్‌లోని సమస్తిపూర్ నియోజకవర్గం నుంచి లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థిగా ఆమె బరిలో దిగుతున్నారు. JDU సీనియర్ లీడర్ అశోక్ చౌదరి కుమార్తె అయిన శాంభవి ప్రస్తుతం మగధ్ యూనివర్సిటీలో PhD చదువుతున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News April 21, 2025
పౌరసత్వం కేసు.. ఆది శ్రీనివాస్‌కు జరిమానా చెల్లించిన చెన్నమనేని

TG: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు BRS మాజీ MLA చెన్నమనేని రమేశ్ రూ.25లక్షల డీడీని హైకోర్టులో అందించారు. జర్మన్ పౌరసత్వం ఉండి రమేశ్ వేములవాడ ఎమ్మెల్యేగా పోటీ చేశారని గతంలో శ్రీనివాస్ HCని ఆశ్రయించారు. రమేశ్ జర్మన్ పౌరసత్వం నిజమేనని గతేడాది DECలో నిర్ధారించిన కోర్టు, శ్రీనివాస్‌కు రూ.25లక్షలు, న్యాయసేవ ప్రాధికార సంస్థకు రూ.5లక్షలు చెల్లించాలని ఆదేశించింది. దీంతో ఇవాళ రమేశ్ జరిమానా కట్టారు.
News April 21, 2025
రేపటి నుంచి ‘NTR-NEEL’ మూవీ షూటింగ్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న ‘NTR-NEEL’ సినిమా షూటింగ్ రేపటి నుంచి మొదలు కానుంది. ఈ సందర్భంగా సముద్రపు ఒడ్డున హీరో, డైరెక్టర్ నిల్చొని డిస్కస్ చేస్తోన్న ఫొటోను మేకర్స్ షేర్ చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని తీరాలను దాటిచేందుకు ఇద్దరూ సిద్ధంగా ఉన్నారని ట్వీట్లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.
News April 21, 2025
న్యాయమూర్తుల బదిలీకి కొలీజియం సిఫారసు

ఏపీ, తెలంగాణ, కర్ణాటక హైకోర్టుల నుంచి పలువురు న్యాయమూర్తుల బదిలీకి కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.మన్మథరావు కర్ణాటక హైకోర్టుకు, తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ సురేందర్ మద్రాస్ హైకోర్టుకు, తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీసుధ కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఏప్రిల్ 15, 19 తేదీల్లో జరిగిన సమావేశాల్లో కొలీజియం నిర్ణయం తీసుకుంది.