News September 10, 2024

టాప్ డైరెక్టర్లతో యంగ్‌టైగర్.. పిక్స్ వైరల్

image

టాప్ డైరెక్టర్లు ప్రశాంత్ నీల్, కొరటాల శివ, అయాన్ ముఖర్జీతో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ మూవీ ట్రైలర్ ఇవాళ ముంబైలో విడుదల కానుండటంతో వీరందరూ అక్కడ కలుసుకున్నారు. కాగా ఈ ముగ్గురు దర్శకులతో ఎన్టీఆర్ ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు. కొరటాలతో ‘దేవర’, నీల్‌తో ‘NTR31’, అయాన్‌తో ‘వార్ 2’ సినిమాలు చేస్తున్నారు.

Similar News

News December 8, 2025

నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ

image

జాతీయ గేయం వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రత్యేక చర్చ జరగనుంది. లోక్‌సభలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ చర్చను ప్రారంభించి సుదీర్ఘంగా ప్రసంగిస్తారు. ఈ గేయంపై 10 గంటలపాటు చర్చ సాగనుంది. రాజ్యసభలో అమిత్‌షా చర్చను మొదలుపెడతారు. స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినిచ్చిన ‘వందేమాతరం’ చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతపై పలువురు ఎంపీలు మాట్లాడతారు.

News December 8, 2025

అప్పట్లో చందర్‌పాల్.. ఇప్పుడు స్మిత్ ఎందుకంటే?

image

యాషెస్ 2వ టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్మిత్ బ్యాటింగ్ చేసే సమయంలో కళ్ల కింద నల్లటి స్టిక్కర్లు అంటించుకొని కనిపించారు. వాటిని యాంటీ గ్లేర్ స్ట్రిప్స్ అని అంటారు. కాంతి నేరుగా కళ్ల మీద పడకుండా అవి ఆపుతాయి. ముఖ్యంగా ఫ్లడ్ లైట్ల నుంచి వచ్చే కాంతిని కట్ చేసి బంతి స్పష్టంగా కనిపించేందుకు సాయపడతాయి. గతంలో వెస్టిండీస్ లెజండరీ బ్యాటర్ చందర్‌పాల్ కూడా ఇలాంటివి ధరించేవారు. మీకు తెలిస్తే COMMENT చేయండి.

News December 8, 2025

ప్రయాణికుల రద్దీ.. ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే(SCR) నేటి నుంచి 8 ప్రత్యేక రైళ్లను నడపనుంది. చర్లపల్లి – యెలహంక, యెలహంక – చర్లపల్లి, చర్లపల్లి – షాలిమార్, షాలిమార్ – చర్లపల్లి మధ్య ఈ స్పెషల్ ట్రైన్లు నడవనున్నాయి. అలాగే HYD – కొట్టాయం, కొట్టాయం – HYD, చర్లపల్లి – H.నిజాముద్దీన్, H.నిజాముద్దీన్ – చర్లపల్లి మధ్య రైళ్లు నడుస్తాయని SCR తెలిపింది. రైళ్ల స్టాపులు తదితర వివరాలను పై ఫొటోల్లో చూడొచ్చు.