News November 21, 2024
జనవరిలో ప్రజలతో ‘మీ ముఖ్యమంత్రి’
AP: ప్రజలతో నేరుగా మాట్లాడాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. 1995-2004 మధ్య డయల్ యువర్ సీఎం కార్యక్రమం నిర్వహించగా, అదే తరహాలో సంక్రాంతి నుంచి ప్రజలతో మీ ముఖ్యమంత్రి కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిని ఆడియో/వీడియో విధానంలో ఎలా చేయాలన్న దానిపై అధికారులతో సీఎం సమాలోచనలు చేస్తున్నారు. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించనుంది.
Similar News
News November 21, 2024
పేసర్లు కెప్టెన్‌గా ఉండాలి: బుమ్రా
BGT నేపథ్యంలో టీమ్ఇండియా కెప్టెన్ బుమ్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘నేనెప్పుడూ పేసర్లు కెప్టెన్‌గా ఉండాలని వాదిస్తా. వారు వ్యూహాత్మకంగా మెరుగ్గా ఉంటారు. గతంలోనూ ఎన్నో ట్రోఫీలు ఇండియా గెలిచింది. ఈసారి పేసర్ కెప్టెన్సీలో కొత్త సంప్రదాయానికి నాంది పలుకుతుంది అనుకుంటున్నా’ అని తెలిపారు. 2017, 2019, 2021, 2023లో ఇండియా BGT గెలుపొందింది. కాగా, ట్రోఫీతో ఇరు జట్ల కెప్టెన్లు దిగిన ఫొటో వైరలవుతోంది.
News November 21, 2024
NEW RECORD: రూ.82 లక్షలను తాకిన బిట్‌కాయిన్
క్రిప్టో కరెన్సీ రారాజు బిట్‌కాయిన్ తన రికార్డులను తానే బద్దలు కొడుతోంది. రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తోంది. తొలిసారి $95000ను తాకింది. మరికాసేపటికే $97,500 స్థాయికి దూసుకెళ్లింది. భారత కరెన్సీలో దీని విలువ రూ.82లక్షలుగా ఉంది. మూమెంటమ్ ఇలాగే కొనసాగితే $100,000ను తాకడానికి మరెంతో సమయం పట్టదు. US ప్రెసిడెంట్‌గా ట్రంప్ ఎన్నికవ్వడం, బ్లాక్‌రాక్ కొత్తగా ఆప్షన్లను ప్రవేశపెట్టడంతో BTC దూసుకెళ్తోంది.
News November 21, 2024
టెన్త్ విద్యార్థులకు శుభవార్త
AP: పదో తరగతి పరీక్షలను విద్యార్థులు తెలుగులోనూ రాసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసేటప్పుడు ఇంగ్లిష్/తెలుగు మీడియంను ఎంపిక చేసుకోవాలని, ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన వారు ఆప్షన్‌ను మార్చుకోవచ్చని తెలిపింది. ఈ ఒక్క ఏడాదికే ఇది వర్తించనుంది. 2020-21లో 1-6 తరగతులను ఇంగ్లిష్(M)లోకి మార్చిన ప్రభుత్వం, వారు టెన్త్‌కు వచ్చాక ENGలోనే పరీక్షలు రాయాలని రూల్ పెట్టింది.