News January 14, 2025

‘మీ పరిహారం హోటల్ ఖర్చులకూ సరిపోదు’.. బైడెన్‌పై సెటైర్లు

image

కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్ బాధితులకు అధ్యక్షుడు జో బైడెన్ పరిహారం ప్రకటించారు. వన్ టైమ్ పేమెంట్ కింద సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు 770 డాలర్ల (రూ.66,687) చొప్పున ఇస్తామని తెలిపారు. దీనిపై కొందరు అమెరికా పౌరులు మండిపడుతున్నారు. ఉక్రెయిన్‌కు బిలియన్ల డాలర్లు ఇస్తూ తమకు ఇంత తక్కువ పరిహారం ఇస్తారా అని పోస్టులు చేస్తున్నారు. ఆ 770 డాలర్లు ఒక రోజు నైట్ హోటల్ ఖర్చులకూ చాలవని సెటైర్లు వేస్తున్నారు.

Similar News

News November 26, 2025

మెదక్: ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధం: కలెక్టర్

image

మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పాపన్నపేట, టేక్మాల్ ఎంపీపీ కార్యాలయాల్లో నామినేషన్ ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. మొదటి విడతలో 160 గ్రామపంచాయతీలో 142 వార్డు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 27న ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉంచాలన్నారు.

News November 26, 2025

ముస్లింలు మాకు ఓటు వేయట్లేదు: కేరళ BJP చీఫ్

image

BJPకి ముస్లింలు ఓట్లు వేయకపోవడం వల్లే క్యాబినెట్‌లో ముస్లిం కమ్యూనిటీకి ప్రాతినిధ్యం లేదని కేంద్ర మాజీ మంత్రి, కేరళ BJP చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ‘ముస్లింలు మాకు సపోర్టు చేయకపోతే మేమేం చేయాలి. మా పార్టీలో ఆ కమ్యూనిటీ నుంచి ఒక్క MP కూడా లేరు. అందుకే క్యాబినెట్‌లో చోటు దక్కలేదు’ అని కోజికోడ్‌లో చెప్పారు. వారు కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేస్తున్నారని, దాని వల్ల ప్రయోజనం ఉందా అని ప్రశ్నించారు.