News December 22, 2024
మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది: జగన్

AP: తన పుట్టినరోజు సందర్భంగా ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ మాజీ సీఎం జగన్ సోషల్ మీడియాలో ధన్యవాదాలు తెలిపారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన వారందరికీ హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు చెప్పారు. తన ప్రతి అడుగులో తోడుగా ఉండి, తనను నడిపిస్తూ వెలకట్టలేని అభిమానాన్ని చూపిస్తున్న వైసీపీ కుటుంబ సభ్యుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదన్నారు.
Similar News
News January 4, 2026
ట్రంప్ తర్వాతి టార్గెట్ ఆ 3 దేశాలేనా?

వెనిజులా అధ్యక్షుడు మదురోను బంధించిన జోష్లో ఉన్న US అధ్యక్షుడు ట్రంప్.. మెక్సికో, క్యూబా, కొలంబియాకూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మెక్సికోను డ్రగ్ ముఠాలు నడుపుతున్నాయని, కొలంబియా కొకైన్ ఫ్యాక్టరీలకు అడ్డాగా మారిందని ట్రంప్ ఆరోపించారు. అమెరికాను నాశనం చేస్తున్న డ్రగ్స్ మాఫియాను అంతం చేసేందుకు ఆ దేశాల్లోనూ ఏదో ఒకటి చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన లాటిన్ అమెరికా దేశాల్లో కలకలం రేపుతోంది.
News January 4, 2026
సుదర్శన చక్రం నుంచి దుర్వాసుడు ఎలా తప్పించుకున్నాడు?

సుదర్శన చక్రం నుంచి ప్రాణాలు దక్కించుకోవడానికి దుర్వాసుడు బ్రహ్మ, శివుని వేడుకుంటాడు. కానీ వారు చేతులెత్తేస్తారు. చివరికి విష్ణుమూర్తిని శరణు కోరగా ‘నా భక్తులే నా హృదయం. అంబరీషుడిని క్షమాపణ కోరితేనే విముక్తి’ అని చెబుతారు. దీంతో దుర్వాసుడు అంబరీషుని పాదాలపై పడతాడు. దయామయుడైన అంబరీషుడు ప్రార్థించడంతో సుదర్శన చక్రం శాంతించి వెనక్కి వెళ్తుంది. భక్తుని పట్ల అహంకారం పనికిరాదని దుర్వాసుడు గ్రహిస్తాడు.
News January 4, 2026
NIT గోవాలో పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

<


