News July 31, 2024
‘మీ దృష్టంతా ఉచిత పథకాలపైనే’.. ఢిల్లీ హైకోర్టు ఫైర్

ఢిల్లీ వరదల్లో ముగ్గురు ఐఏఎస్ అభ్యర్థులు మరణించడంపై హైకోర్టు మున్సిపల్ అధికారులపై మండిపడింది. ‘ఉద్యోగులకు శాలరీలు ఇచ్చేందుకే మీ దగ్గర డబ్బుల్లేవు. అలాంటప్పుడు మౌలిక వసతులు ఎలా కల్పిస్తారు? మీరు ఉచిత పథకాలను ప్రజలకు అలవాటు చేశారు. పన్నులు వసూలు చేయడంపై దృష్టి పెట్టరు. తద్వారా అభివృద్ధి జరగదు. అందుకే ఈ ప్రమాదం జరిగింది. మౌలిక వసతులు సరిగా ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు’ అని వ్యాఖ్యానించింది.
Similar News
News February 4, 2026
ఉదయాన్నే ఈ 6 పనులతో గుండె ఆరోగ్యం మీ చేతుల్లో!

గుండె దృఢంగా ఉండాలంటే ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగి శరీరాన్ని హైడ్రేట్ చేయాలని, చక్కెర తక్కువగా ఉన్న ప్రొటీన్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ‘కేవలం 5 నిమిషాల ధ్యానం, కొద్దిసేపు ఎండలో నడవడం, రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేస్తే BP కంట్రోల్‌లో ఉంటుంది. నిద్రలేవగానే కనీసం 30 నిమిషాల పాటు మొబైల్‌కు దూరంగా ఉంటే స్ట్రెస్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది’ అని చెబుతున్నారు.
News February 4, 2026
ఐదేళ్లలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం

APని ప్రకృతి వ్యవసాయ కేంద్రంగా మార్చాలని CM చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఐదేళ్లలో 50 లక్షల ఎకరాల్లో 40 లక్షల మంది రైతులతో ప్రకృతి సాగు చేయించడమే లక్ష్యమన్నారు. ఏలూరులో ‘కోకో సిటీ’, లంబసింగిలో కుంకుమ పువ్వు సాగుకు శ్రీకారం చుట్టారు. విజయవాడలో ఫ్లవర్ మార్కెట్ ఏర్పాటుతో పాటు ఆన్‌లైన్ కూరగాయల డెలివరీ కోసం ‘డిజీ రైతు బజార్’, యంత్రాల బుకింగ్ కోసం ‘కిసాన్ డ్రోన్’ యాప్‌లను ప్రారంభించారు.
News February 3, 2026
క్యాబినెట్ భేటీ: ‘నెయ్యి కల్తీ’పై 2 గంటలు PPT

AP: క్యాబినెట్ మీటింగ్ అనేసరికి అధికారులు పలు అంశాలతో అజెండాను రెడీ చేస్తుంటారు. మంత్రివర్గమూ సుదీర్ఘంగా వాటిని చర్చిస్తుంది. అయితే ఇవాళ్టి భేటీలో మాత్రం శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం ఒక్కదానిపైనే చర్చించింది. నెయ్యి కల్తీపై దాదాపు 2 గంటలు PPT ప్రజెంటేషన్‌తో CM వివరించారు. సిట్ పేర్కొన్న అంశాలను లోతుగా విశ్లేషించారు. తెరవెనుక వ్యక్తులెవరో కూడా తేల్చాలని నిర్ణయించినట్లు సమాచారం.


