News April 4, 2024
మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది: రాహుల్

దేశాన్ని నిర్మించేదెవరో, నాశనం చేసేదెవరో ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ‘కాంగ్రెస్ అంటే యువతకు తొలి ఉద్యోగం, MSP గ్యారంటీ, పేద మహిళలను మిలియనీర్లుగా మార్చడం, కులగణన, కార్మికుల దినసరి కూలీ రూ.400, రాజ్యాంగ-పౌర హక్కుల పరిరక్షణ. BJP అంటే నిరుద్యోగం, రైతులకు రుణభారం, వివక్ష, నియంతృత్వం. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. సరైన నిర్ణయం తీసుకోండి’ అని పేర్కొన్నారు.
Similar News
News January 23, 2026
రూర్కెలా-జగదల్పూర్ ట్రైన్కు అదనపు బోగీ

రూర్కెలా-జగదల్పూర్ (ట్రైన్ నంబర్ 18107)కి అదనపు భోగిని ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రద్దీని అదుపు చేసేందుకు గాను తాత్కాలికంగా ఒక స్లీపర్ క్లాస్ భోగిని అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 23, 2026
IBPS RRB క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

IBPS ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి https://www.ibps.in/ వెబ్సైట్లో ఫలితాలు తెలుసుకోవచ్చు. 8,002 పోస్టుల భర్తీకి డిసెంబర్ 6,7,3,14 తేదీల్లో ప్రిలిమ్స్ నిర్వహించారు. ఫలితాల కోసం ఇక్కడ <
News January 23, 2026
బత్తాయి చెట్లు ఎండిపోతున్నాయా?

వేరుకుళ్లు తెగులు సోకినప్పుడు చెట్లు వడలి కాయలు రాలిపోతాయి. దీని నివారణకు 1% బోర్డో మిశ్రమం లేదా 0.2% కార్బండిజమ్(లీటరు నీటికి 2గ్రా. చొప్పున) మిశ్రమం 20 లీటర్లు పాదుల్లో పోయాలి. ఒక్కో చెట్టుకు 10KGల మేర వృద్ధి చేసిన ట్రైకోడెర్మా విరివిడిని చెట్ల పాదుల్లో కలియబెట్టాలి. ట్రైకోడెర్మా రెస్సీ 100గ్రా, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ 100గ్రా, 2KGల వేప పిండి, 25KGల పశువుల ఎరువుతో కలిపి పాదుల్లో వేసుకోవాలి.


