News September 5, 2024

మీ సాయం మరువలేం: పవన్ కళ్యాణ్

image

AP: వరద బాధితుల సహాయార్థం విరాళాలందించిన సినీనటులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపింది. మహేశ్ బాబు, ప్రభాస్, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నందమూరి బాలకృష్ణ, సిద్ధు జొన్నలగడ్డ, సాయి తేజ్, వరుణ్ తేజ్‌ను ఉప ముఖ్యమంత్రి అభినందిస్తున్నారని ట్వీట్ చేసింది. కష్టకాలంలో ప్రజలకు అండగా, సహాయం చేసిన వారి ఔదార్యం మరెంతోమందికి భరోసా కల్పిస్తుందని పేర్కొంది.

Similar News

News January 30, 2026

శ్రీకాకుళం: సూసైడ్ చేసుకుంటానని ఫొన్..కాపాడిన పోలీసులు

image

శ్రీకాకుళం(D) పోలాకి(M) చెందిన ఓ మహిళ గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటానని కుటుంబీకులకు ఫొన్ చేసింది. వారు ఆందోళన చెంది 112 నంబర్‌కు సమాచారం ఇచ్చారు. కంట్రోల్ రూం పోలాకి పోలీసులకు విషయం తెలపగా ఎస్సై రంజిత్ సదరు మహిళకు ఫొన్‌లో కాంటాక్టై ఆమదాలవలస పరిసర ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. అనంతరం జీఆర్పీ, లోకల్ పోలీసులకు సమాచారమివ్వడంతో మహిళను సురక్షితంగా కాపాడారు.

News January 30, 2026

KCRకు మరోసారి నోటీసులు!

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో BRS అధినేత KCRకు ఇవాళ సిట్ <<18998286>>మరోసారి<<>> నోటీసులు ఇవ్వనుంది. రేపు విచారణకు రావాలని అందులో పేర్కొననున్నట్లు తెలుస్తోంది. అయితే నందినగర్‌లోని ఇంట్లో నోటీసులు ఇస్తారా? ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో అందిస్తారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. నిన్న నందినగర్‌ నివాసంలో సిట్ నోటీసులిచ్చి విచారణకు రావాలని కోరగా, KCR అభ్యర్థన మేరకు నేడు మినహాయింపు ఇచ్చారు.

News January 30, 2026

CSIR ఇన్నోవేషన్ కాంప్లెక్స్‌లో ఉద్యోగాలు

image

ముంబైలోని <>CSIR <<>>ఇన్నోవేషన్ కాంప్లెక్స్ 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు FEB 17 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG(కెమిస్ట్రీ/ ఫార్మాస్యూటికల్ అనాలసిస్/ఫార్మాస్యూటికల్ సైన్సెస్/ లైఫ్ సైన్సెస్/బయో టెక్నాలజీ/బయో కెమిస్ట్రీ/మైక్రో బయాలజీ, CS), BE/BTech, ME/MTech అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్ట్ ద్వారా మార్చి 2న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.